తెలుగు సినిమా ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చేలా చేసినటువంటి డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. తెలుగు ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీసిన వారిలో రాజమౌళి నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. అలాంటి రాజమౌళి సినిమాలో ఆఫర్ల కోసం ఎంతో మంది నటినటులు ఎదురు చూస్తూ ఉంటారు. బాహబలి మూవీ ద్వారా ప్రభాస్ ను పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు వచ్చేలా చేశారు. అంతేకాకుండా సినిమాతో ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డు కూడా తేవడంలో ప్రధమ పాత్ర పోషించారని చెప్పవచ్చు.
Advertisement
అలాంటి రాజమౌళి డైరెక్షన్ చేసిన సినిమాల్లో ఇప్పటికి ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. కథ, కంటెంట్ పరంగా ఎంతో జాగ్రత్తగా ఆలోచించే రాజమౌళి ఒక్కో సినిమాకి కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారట. మరి అలా సంపాదించిన డబ్బును ఆయన ఏం చేస్తారనేది చాలామంది మధ్యలో ఉన్న ప్రశ్న. ఆయనకు వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్ ఫుడ్ బిజినెస్ లో పెట్టుబడులు పెడుతున్నారట. దీనికి ప్రధాన కారణం ఆయన సినిమాల నుంచి తప్పుకున్న తర్వాత కూడా నిరంతర ఆదాయం రావాలి కాబట్టి ఆయన ఆ బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతున్నారట.
Advertisement
ఈ విషయాన్ని తన భార్య రమా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన ఎంత సంపాదించిన డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని ప్రతి రూపాయి దగ్గరుండి లెక్కిస్తారని, డబ్బు విలువ ఆయనకు ఎంతో తెలుసు అని చెప్పింది. ముందు చూపుతో ఆలోచించే రాజమౌళి ఈ విధంగా పలు బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతూ లాభాలు అర్జీస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో, చివరికి మహాభారతం సినిమా చేసి ఇండస్ట్రీకి దూరమవుతారని తెలుస్తోంది.