భారత్ వేదికగా జరుగుతున్న 2023 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ లో భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరుచుతున్న విషయం తెలిసిందే. భారత్ విజయంలో బౌలర్ మహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బుమ్రా, సిరాజ్ లు కూడా వికెట్లను తీసి మంచి బౌలింగ్ చేస్తున్నప్పటికీ షమీ అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో టాప్ 5లో కొనసాగుతున్నాడు. షమీ ఆడిన నాలుగు మ్యాచ్ లలో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు.
Advertisement
ఇక ఈ టోర్నీలో మహ్మద్ షమీ అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థులను తక్కువ పరుగులకే కుప్ప కూలుస్తూ.. వరుస విజయాలతో సెమీస్ కి చేరిండి భారత జట్టు. ప్రపంచ కప్ టోర్నీలో తొలి మూడు మ్యాచ్ లల్లో జట్టులో స్థానం దక్కని షమీ.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. షమీ వచ్చిన మ్యాచ్ దగ్గర నుంచి అదరగొడుతున్నాడు. రెండు మ్యాచ్ లలో 5 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. షమీ అద్భుతమైన ప్రదర్శన గురించి మాజీ భార్య హాసిన్ జహాన్ స్పందించింది. 2023 వన్డే ప్రపంచ కప్ లో భారత్ విజయాల్లో షమీ ప్రదర్శన గురించి మాజీ భార్య హాసిన్ జహాన్ ని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఆమె ఇలా స్పందించింది. తాను క్రికెట్ కి ఫ్యాన్ కాదని చెప్పింది.
Advertisement
అలాగే క్రికెటర్లకు తాను ఏమి అభిమానిని కాదని చెప్పుకొచ్చింది. మహ్మద్ షమీ మంచి ఆడితే.. టీమిండియాలో కొనసాగుతాడని అభిప్రాయపడింది. అలా జరిగితే బాగా సంపాదించేందుకు వీలు అవుతుందని కుటుంబానికి కూడా అది మంచిదేగా అని చెప్పుకొచ్చింది మహ్మద్ షమీ మాజీ భార్య. ఏది ఏమైనా కానివ్వండి. షమీ మంచిగా ఆడితే భారత జట్టులో కొనసాగుతాడు. బాగా సంపాదిస్తాడు. అది మా భవిష్యత్ కి మంచిది అని సమాధానం చెప్పింది జహాన్. మహ్మద్ షమీ, హాసిన్ జహాన్ 2014లో వివాహం చేసుకున్నారు. 2015లో వారికి ఓ కూతురు జన్మించింది. 2018లో కట్నం సహా పలు అంశాల్లో షమీ వేధిస్తున్నాడంటూ హాసిన్ అతనిపై వే**ధింపు కేసు పెట్టింది. 2018 నుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవలే కోల్ కతా కోర్టు ప్రతీ నెల హాసిన్ కి 1లక్ష 30వేలు భరణంగా చెల్లించాలని షమీని ఆదేశిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.