దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం యాత్ర. ఇప్పుడు దానికి సీక్వెల్ గా యాత్ర 2 తెరకెక్కించారు దర్శకుడు మహి వి.రాఘవ్. యాత్ర 2 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికల్లో విజయం సాధించడం నుంచి 2019 ఎన్నికల్లో సీఎంగా జగన్ విజయం సాధించే వరకు జరిగిన పలు సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సినిమా : యాత్ర 2
నటీ నటులు : మమ్ముట్టి, జీవా, కేతకి, నారాయణ్, సుజానే, బెర్నరెర్ట్, మహేష్ ముంజ్రేకర్, శుభలేఖ సుధాకర్
నిర్మాణ సంస్థ : త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్
నిర్మాత : శివ మేక
రచన, దర్శకుడు : మహి వి.రాఘవ్
సంగీతం : సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రఫీ : మది
కథ మరియు విశ్లేషణ :
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఆయన తనయుడు జగన్ చేసిన ఓదార్పు యాత్ర.. ఆ సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలు.. ఆ పాదయాత్ర చేపట్టడానికి ఆయనను ప్రేరేపించిన సంఘటనలు.. ఆ పాతయాత్ర కారణంగా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న ఉదంతాల సమాహారమే యాత్ర 2 కథ. తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్రలు.. వాటిని ఎలా ఎదుర్కొని జగన్ ప్రజా నాయకుడిగా ఎదిగారనేది ఈ సినిమా యొక్క కథ.
వైఎస్ జగన్ చేపట్టిన యాత్ర గురించి దాదాపు అందరికీ తెలిసిందే. యాత్ర చేపట్టడానికి ప్రధాన కారణం.. ఆ సమయంలో ఆయనకు ఎదురైన సంఘటనలు ఏంటి..? అనేది చాలా ఎమోషనల్ గా చూపించాడు. 2009లో కడప ఎంపీగా వైఎస్ జగన్ పోటీ చేస్తున్నట్టు వైఎస్సార్ ప్రకటించే సన్నివేశంలో యాత్ర 2 కథ ప్రారంభం అవుతుంది. చిత్తూరు రచ్చబండ కోసం వెళ్తూ వైఎస్ఆర్ మరణించడం కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ప్రజల కోసం జగన్ అధిష్టానాన్ని ఎదురించిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. 2014 ఎన్నికల సమయంలో ఓడిపోయినా పర్వాలేదు.. కానీ రుణమాఫీ చేస్తామని అబద్దపు హామీ ఇవ్వలేనని జగన్ చెప్పే మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి.
డైలాగ్స్ :
- ముఖ్యంగా జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమై పోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్ ..
- నేను విన్నాను-నేను ఉన్నాను అంటూ జగన్ చెప్పే మాటలు ప్రజలకు ఆయన ఇచ్చిన భరోసాని తెలియజేస్తుంది.
- పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలినా అది పిల్లే.. పులిని బోనులో పెట్టినా అది పులే అంటూ వైఎస్ జగన్ గురించి ఓ సీనియర్ నేత చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
జగన్ గా జీవా అదురగొట్టేశాడు. వైఎస్ భారతీగా కేతకి నారాయణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నెర్ట్ సరిగ్గా సరిపోయారు. లుక్ పరంగా కూడా సోనియాగాంధీని గుర్తు చేశారు. చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ కీలక నేత రెడ్డిగా శుభలేఖ సుధాకర్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రమేరకు రాణించారు.
ప్లస్ పాయింట్స్:
- కథ
- మమ్ముట్టి, జీవా నటన
మైనస్ పాయింట్స్ :
- కథనం స్లోగా సాగడం
- బీజీఎం
రేటింగ్: 3 /5