ఏడాది వరల్డ్ కప్ 2023 టోర్నీ ఇండియాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. ఈ తనంలో వరల్డ్ కప్ 2023 టోర్నీ షెడ్యూల్ ను విడుదల చేసింది ఐసీసీ పాలక మండలి. 10 సంవత్సరాల తర్వాత ఇండియా వేదికగా ప్రపంచ కప్ వన్డే టోర్నమెంట్ జరుగుతోంది. ఇక తాజాగా ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం…. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది అన్నమాట. అయితే ఈ టోర్నీలో ఏకంగా 10 జట్లు పాల్గొనున్నాయి.
Advertisement
ఇప్పటికే 8 జట్లు ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ కు క్వాలిఫై కాగా మరో రెండు జట్లు త్వరలోనే ఫైనల్ కానున్నాయి. క్వాలిఫైయర్ టోర్నమెంట్ ద్వారా రెండు టీమ్స్ కి ఎంట్రీ ఇస్తాయి.క్వాలిఫైర్ లో పోటీ పడుతున్న టీమ్స్ లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్, ఒక సారి ప్రపంచ ఛాంపియన్ శ్రీలంక ఉన్నాయి.కాగా, ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ ను చెన్నై లో కాకుండా… బెంగుళూరు లో పెట్టాలని పాకిస్థాన్… ఇప్పటికే ఐసీసీని కోరింది. అయితే పాకిస్తాన్ డిమాండ్ ను నిరాకరించిన ఐసీసీ…చెన్నై వేదికగా నే ఆఫ్ఘన్, పాక్ మ్యాచ్ నిర్వహించాలని డిసైడ్ అయింది.
Advertisement
అటు ఆస్ట్రేలియా తో మ్యాచ్ ను బెంగుళూరు లో కాకుండా.. చెన్నై లో పెట్టాలని పాక్.. కోరింది. ఇందుకు కూడా నిరాకరించిన ఐసీసీ… బెంగళూరులోని నిర్వహించాలని ఫైనల్ డెసిషన్ తీసుకుంది. కాగా, నవంబర్ 15న ముంబై వాంఖడే స్టేడియంలో మొదటి సెమీ ఫైనల్ జరగనుండగా…నవంబర్ 16న కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో రెండో సెమీస్ జరగనుంది. నవంబర్ 19న గుజరాత్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి
అత్త చేతిలో ధోని వ్యాపారం..ఏకంగా రూ.800 కోట్లు !
వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !
Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు
ఐసీసీ 2023 క్రికెట్ వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల #ICCWorldCup2023 pic.twitter.com/G61qtoLRza
— Telugu Scribe (@TeluguScribe) June 27, 2023