ఈ నెల 27 నుండి యూఏఈ వేదికగా పురుషుల ఆసియా కప్ అనేది జరగనుంది. అయితే అక్టోబర్ నెలలో మహిళల ఆసియా కప్ జరుగుతుంది. అక్టోబర్ 1 నుండి 16 వరకు జరిగే ఈ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిధ్యం ఇవ్వనుంది. అయితే ఈ మధ్య పురుషుల క్రికెట్ తో పాటుగా మహిళల క్రికెట్ కు కూడా మంచి రోజులు వస్తున్నాయి అనెడఁగి తెలిసిందే. అందుకే ఐసీసీ కూడా మహిళల ఎఫ్టీపీలో ఈ ఆసియా కప్ కు చోటు అనేది ఇచ్చింది.
Advertisement
అయితే ఈ మహిళలు ఆసియా కప్ అనేది 2004 లో వన్డే ఫార్మాట్ లో ప్రారంభం అయ్యింది. అప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 7 సార్లు ఈ టోర్నీ అనేది జరిగింది. కానీ 2012 నుండి ఈ టోర్నీ అనేది టీ20 ఫార్మాట్ లో జరుగుతుంది. పురుషుల ఆసియా కప్ లో ఆరు జట్లే ఆడిన.. ఈ మహిళల టోర్నీలో ఏడు జట్లు పోటీ పడుతాయి. అందులో భారత్ తో పాటుగా పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, థాయిలాండ్, మలేషియా, యూఏఈ ఉంటాయి.
Advertisement
ఇక ఇప్పటివరకు ఏడుసార్లు జరిగిన ఈ టోర్నీలో 2004 నుండి 2016 వరకు వరుసగా ఆరుసార్లు ఇండియా జట్టే విజేతగా నిలిచింది. కానీ 2018 లో మాత్రం ఫైనల్స్ లో ఇండియాను ఓడించి బంగ్లాదేశ్ జట్టు టైటిల్ అందుకుంది. కానీ ఆ తర్వాత 2020 లో కరోనా కారణంగా ఈ టోర్నీ ఒక్క ఏడాది వాయిదా పడింది. కానీ 2021 లో కూడా కరోనా వల్ల జరగని ఈ టోర్నీ ఈ ఏడాది జరగబోతుంది.
ఇవి కూడా చదవండి :