ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయింది. ప్రజలు మీడియాను ఫాలో అవుతున్నారో లేదో కానీ సోషల్ మీడియాను మాత్రం కచ్చితంగా ఫాలో అవుతున్నారు. ఇక సోషల్ మీడియాతో చాలా ప్రయోజాలు ఉండటం తో పాటూ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు సోషల్ మీడియలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఆకతాయిలు సోషల్ మీడియాలో మహిళలను వేదింపులకు గురిచేస్తూ ఉంటారు.
Advertisement
అసభ్యమైన పదజాలంతో కామెంట్ లలో దూషిస్తూ ఉంటారు. ఇక అలా కామెంట్ లు చేసేవారిని ఏం చేయాలో తెలియక మహిళలు కూడా అలానే వదిలేస్తూ ఉంటారు. కొందరు బ్లాక్ చేస్తారు…కానీ ఇక్కడ మహిళ తనకు సోషల్ మీడియాలో మెసేజ్ లు పెడుతూ వేధిస్తున్న యువకుడిని ఇంటికి వెళ్లి మరీ చెప్పుదెబ్బలు కొట్టింది. ఈ ఘటన నెల్లూరు లో చోటు చేసుకుంది.
Advertisement
నెల్లూరుకి చెందిన ఓ మహిళకు కల్యాణ్ అనే యువకుడు కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్ లో అసభ్య పదజాలంతో దూషిస్తూ మెసేజ్ లు పెడుతున్నాడు. సదరు మహిళ హెచ్చరించినప్పటికీ యువకుడిలో మార్పు రాలేదు. దాంతో ఆ వేధింపులు తట్టుకోలేక మహిళ కల్యాణ్ వద్దకు వెళ్లి నడీరొడ్డు పై అతడిని చెప్పుతో కొట్టింది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ALSO READ : దోమలకు అలాంటి వారి రక్తం అంటే చాలా ఇష్టమట.. సైంటిస్టులు ఏమంటున్నారంటే..?