టాలీవుడ్ లో కింగ్ గా.. మన్మధుడుగా.. గ్రీకువీరుడుగా..ఇండస్ట్రీలో నాగార్జునని ఎవరైనా సరే అన్నయ్య అని అస్సలు పిలవరు. కానీ అలాంటిది ఓ స్టార్ హీరోయిన్ నాగార్జునని అన్నయ్య అని పిలిచింది. మరి ఇంతకీ నాగార్జునకి చెల్లెలు అయ్యే ఆ హీరోయిన్ ఎవరు.. ? నిజంగానే వీరిద్దరి మధ్య అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఉందా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
అల్లరి నరేష్ హీరోగా వచ్చిన క్రేజీ ఫెలో అనే మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళీ హీరోయిన్ మీర్నా మీనన్.. ఆ తర్వాత ఈమె నరేష్ సరసన ఉగ్రం మూవీలో కూడా నటించింది. అయితే త్వరలో సంక్రాంతి కానుకగా రాబోతున్న నా సామి రంగ మూవీలో అల్లరి నరేష్ కి భార్యగా కూడా ఈ సినిమాలో చేస్తుంది.ఇక నా సామి రంగా మూవీలో నాగార్జున హీరోగా చేస్తే నాగార్జునకి ప్రాణ స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఆషికా రంగనాథన్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే రాజ్ తరుణ్ కూడా కీలక పాత్రలో చేస్తున్నారు.
Advertisement
అయితే తాజాగా మీర్నా మీనన్ నాగార్జునతో కలిసి ఉన్న ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి మా అన్నయ్య కింగ్ నాగార్జున సార్ అంటూ కింద క్యాప్షన్ పెట్టింది. అయితే ప్రస్తుతం ఈమె పెట్టిన పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొట్టడం తో చాలామంది నెటిజన్స్ నాగార్జునకి నిజంగానే మీర్నా మీనన్ చెల్లెలు అవుతుందా.. వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఇన్ని రోజులు ఎవరికీ తెలియదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే నాగార్జున నా సామి రంగ మూవీలో మీర్నా మీనన్ అల్లరి నరేష్ భార్యగా చేస్తుంది.కాబట్టి ఆయనను అలా అన్నయ్యా అని పిలిచినట్లు తెలుస్తోంది.ఇక నా సామి రంగా మూవీ షూటింగ్ సెట్ లో నాగార్జున తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసి అలా పోస్ట్ పెట్టినట్టు సమాచారం. అయితే హీరోయిన్లు ఎవరైనా సరే నాగార్జునని అన్నయ్య అని పిలవరు. కానీ అలాంటిది మొదటిసారి మీర్నా మీనన్ అలా పిలిచేసరికి అందరూ షాక్ అవుతున్నారు.