Home » చంద్రబాబును కుప్పంలో ఓడిస్తారా..? జగన్ వ్యూహం ఏంటంటే..?

చంద్రబాబును కుప్పంలో ఓడిస్తారా..? జగన్ వ్యూహం ఏంటంటే..?

by Anji
Published: Last Updated on
Ad

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ నేతలు ప్రతిపక్ష టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. టీడీపీ నేతలు అధికార నేతల మాటలపై స్పందిస్తున్నారు. మొత్తానికి ఇరు పక్షాల నేతల మధ్య ప్రతిరోజు మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. చంద్రబాబును కుప్పంలో ఓడిస్తామని సీఎం జగన్ పేర్కొంటే.. పులివెందులలో జగన్ ని ఓడిస్తామని చంద్రబాబు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చంద్రబాబును కుప్పంలో ఓడిస్తారా..? అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

కుప్పం నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 1989 నుంచి మొదలై.. నేటి వరకు కూడా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దాదాపు 35 ఏళ్లుగా చంద్రబాబే కుప్పం నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అలాంటి కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేస్తామని.. why not 175 అంటూ సీఎం జగన్ నినాదాలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండటంతో.. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ ధీమాతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని ధీమాతో ఉన్నారు వైసీపీ నేతలు.

Advertisement

ఇటీవలే కుప్పం నుంచి హీరో విశాల్ పోటీ చేస్తాడని వార్తలు వినిపించాయి. కానీ తాను పోటీ చేయను అని విశాల్ ప్రకటించడం గమనార్హం. 2004లో చంద్రబాబు పై ఎం.సుబ్రహ్మణ్యరెడ్డిని బరిలోకి దించారు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి. ఆ ఎన్నికల్లో 70 శాతం ఓట్లను సాధించారు చంద్రబాబు. 2009లో 61.9 శాతం ఓట్లు లభించాయి. 2014 ఎన్నికల్లో ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని బరిలోకి దించారు జగన్. 62.5 శాతం ఓట్లు లభించాయి. 2019 ఎన్నికల్లో కూడా చంద్రమౌళికే టికెట్ ఇచ్చారు. చంద్రమౌళిని గెలిపిస్తే.. ఆయనను మంత్రి చేస్తానని జగన్ హామి ఇచ్చారు. కుప్పంలో కాస్త ఓట్ల శాతం తగ్గిందనే చెప్పాలి. 2019లో 55 శాతం ఓట్లు సాధించారు.

కుప్పంలో బీసీ అభ్యర్థి కే.భరత్ పేరు తెరపైకి వచ్చింది. భరత్ ఎవ్వరో కాదండోయ్.. చంద్రమౌళి కుమారుడే. కుప్పంలో తొలుత ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు భరత్ కి. ఆ తరువాత అభివృద్ధి పనులను చేయించారు. ప్రతీ పని భరత్ ఆధ్వర్యంలోనే జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి అండదండలతో భరత్ చాలా కష్టపడుతున్నాడు. చంద్రబాబుని భరత్ ఓడిస్తాడా.? అంటే.. అంత ఈజీ కాదనే చెప్పాలి. ప్రభుత్వం మీద వ్యతిరేకత.. జనసేనతో పొత్తు కలిసి రావడంతో ఈ సారి చంద్రబాబు మెజార్టీ కాస్త ఎక్కువగానే ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. లోకల్ అభ్యర్థిని ఇక్కడే ఉంటాను అంటూ భరత్ ప్రచారం చేస్తున్నారు.  ఈ రసవత్తర ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తాడా..? భరత్ గెలుస్తాడో వేచి చూడాలి మరీ. 

మరిన్నీ  తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading