సీరియల్స్ లో నటించకూడదు అని చెప్పినందుకు ఓ నటి ఏకంగా భర్తనే లేపేయడానికి స్కెచ్ వేసింది. ప్రియుడితో కలిసి భర్తకు స్పాట్ పెట్టింది. కానీ చివరికి ప్లాన్ బెడిసి కొట్టడంతో జైలు పాలయ్యింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. సీరియల్ నటి రమ్య ప్రస్తుతం డెయిలీసీరియల్స్ లో నటిస్తోంది. కాగా ఆమె భర్త రమేష్ కు భార్య సీరియల్స్ లో నటించడం ఇష్టం లేదు.
Advertisement
ఆ విషయం భార్యకు చెప్పినప్పటికీ ఆమె సీరియల్స్ ను విడిచిపెట్టేందుకు ఒప్పుకోలేదు. దాంతో ఇద్దరి మధ్య కొంతకాలం నుండి గొడవలు జరుగుతున్నాయి. ఇక రీసెంట్ గా ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోయాయి. అయితే రమ్యకు సీరియల్స్ లో నటిస్తున్న డానియల్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దాంతో రమ్య భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
Advertisement
ఎలాగైనా భర్తను ఈ లోకంలోనే లేకుండా చేయాలని అనుకుంది. అదే విషయం ప్రియుడు డానియల్ కు చెప్పింది. డానియల్ రమేష్ ఇంటిని కూడా కొనుగోలు చేయాలని అనుకున్నాడు. కానీ భేరం కుదరలేదు. ఇక ఇల్లు తక్కువ ధరకు అమ్మలేదనే కోపం ఓ వైపు మరోవైపు ప్రియురాలి కోరిక ఇలా రెండూ ఒకటే కావడంతో రమేష్ ను చంపేందుకు ఒప్పుకున్నాడు. బైక్ పై వెళుతున్న రమేష్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కానీ రమేష్ గాయాలతో పడి ఉండటం చూసి కొందరు ఆస్పత్రిలో చేర్పించగా కోలుకున్నాడు. ఇక జరిగింది మొత్తం పోలీసులకు చెప్పడంతో రమ్య డానియల్ ఇద్దరూ కటకటాల పాలయ్యారు.