బట్టలపై మరకలు పడితే వాటిని వదలగొట్టే వరకు మనం ఉతుకుతూనే ఉంటాం. ఇప్పుడు వాషింగ్ మిషెన్లు వచ్చిన తరువాత ఈ బట్టలు ఉతకడం కొంతవరకు తేలిక అయ్యిందనే చెప్పాలి. నిజానికి ఇది పెద్ద పని. బట్టలు నానబెట్టడం, వాటిని ఉతకడం, తీసుకెళ్లి ఆరవేయడం, ఆరిన వాటిని తెచ్చి మడతపెట్టడం.. ఇన్ని పనులు చేసుకోవాలి. అయితే.. వాషింగ్ మెషీన్లు వచ్చాక కొంత పని మాత్రం తగ్గింది. అయినప్పటికీ.. ఇందులో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Advertisement
తగినంత నీరు మెషీన్ తీసుకునేలా ఏర్పాటు చేసుకోవడం, ఉతకాల్సిన బట్టలను విడివిడిగా, రంగులంటకుండా చూసుకుని ఏరి పెట్టుకోవడం, వాటిని మెషీన్ లో వేసి టైం సెట్ చేయాలి. ఇంతవరకు అందరు బాగానే చేస్తారు. బట్టలు ఉతకడం అయ్యిన తరువాత తిరిగి ఆ మెషీన్ డోర్ ని మూసి వేస్తూ ఉంటారు. బట్టలు తీసుకోవడం అయ్యాక.. అందులో దుమ్ము ధూళి పడకూడదని ఇలా చేస్తూ ఉంటారు.
Advertisement
కానీ, అది కూడా కరెక్ట్ కాదు. ఈ బట్టలను తీయడం అయిపోయిన తరువాత కొంత సేపు ఆ మూతని ఓపెన్ చేసే ఉంచాలి. ఎందుకంటే అందులో ఉండే తేమ వలన బాక్టీరియా ఏర్పడకుండా ఉంటుంది. అలాగే.. ఆ మూతని తీసి ఉంచితే అందులో వాసన పోయి, మళ్ళీ బట్టలు వేసినప్పుడు దుర్వాసన రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ సారి నుంచి వాషింగ్ మెషీన్ వేసినపుడు తప్పకుండ కొంతసేపటి వరకు మూత తీసేసి ఉంచండి.
మరిన్ని..
Ys Sharmila : వైఎస్ షర్మిల కొడుకు హీరోగా సినిమా.. దర్శకుడు ఎవరంటే?
టెస్టు క్రికెట్ కు వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్
MS Dhoni Assets : ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?