Home » పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ అంతటి స్టార్ గా పైకి రావాల్సిన సుమంత్ ఎందుకు ఎదగలేకపోయారు ?

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ అంతటి స్టార్ గా పైకి రావాల్సిన సుమంత్ ఎందుకు ఎదగలేకపోయారు ?

by Anji
Published: Last Updated on
Ad

యార్లగడ్డ సుమంత్ కుమార్ నాగార్జున అల్లుడు సుమంత్ అంటే దాదాపు అందరికీ సుపరిచితుడే. హీరోగా స్టార్ హోదా లేకపోయినా సినీ అభిమానులందరికీ బాగా తెలిసిన సుమంత్ కు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంది. తాత లెజెండ్, మామ సూపర్ స్టార్, తండ్రి నిర్మాత లక్షల సంఖ్యలో ఉన్న అక్కినేని అభిమానులు. దీనికి తోడు ఆరడుగుల అందగాడు. మంచి నటనాపరుడు. ఇంతకుమించి ఒక వ్యక్తి స్టార్ హీరో అవ్వడానికి ఇంకేం కావాలి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే మన తెలుగు సామెత మన సుమంత్ కు సరిగ్గా సరిపోతుంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల సరసన హీరోగా వెలుగొందాల్సిన సుమంత్ ఎందుకు  సక్సెస్ సాధించలేకపోయాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

 

చిన్నతనం నుంచే సినిమా అంటే ఇష్టం ఏర్పడి హీరో అవుదామని అప్పటినుండే సంకల్పించుకున్న సుమంత్ హీరో కాకముందే ఒక ఫిలిమ్ స్కూల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ని ఎంచుకున్నాడు. 1987 నుంచి నాగార్జున సుమంత్ డెబ్యూ మూవీ కోసం ప్లాన్ చేస్తే, 1999లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో ప్రేమ కథ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.  దీంతో  చాలా కేర్ తీసుకొని యువకుడు మూవీ చేశారు. ఆ సినిమా యావరేజ్ గా ఆడింది.  మూడో సినిమా రాఘవేంద్రరావు డైరెక్షన్లో రూపొందిన పెళ్లి సంబంధం కూడా ఫ్లాప్ అయింది. దీంతో సుమంత్ కొద్ది రోజుల పాటు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ముందే ఒప్పేసుకున్న స్నేహమంటే ఇదేరా, రామ్మా చిలకమ్మా కూడా తనలో ఒక డీసెంట్ యాక్టర్ ఉన్నాడని ప్రూఫ్ చేశాయి. కానీ కమర్షియల్ గా మాత్రం విజయం దక్కలేదు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత నాగార్జున నిర్మాతగా స్వయంగా దగ్గరుండి మరి పక్కా ప్లానింగ్ తో చేసిన మూవీ సత్యం.

Advertisement

ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి సుమంత్ కు హీరోగా మంచి గుర్తింపు తెచ్చింది. కానీ స్టార్ హోదా మాత్రం రాలేదు. తర్వాత గౌరి మూవీ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గోదావరి మూవీ క్లాస్ ఇమేజ్ ని తీసుకొచ్చింది. 2011లో గోల్కొండ హైస్కూల్ సినిమా దాకా హిట్ లేదు. చాలా తక్కువ సినిమాలు చేస్తూ..   కొత్త తరహా సినిమాలు ట్రై చేస్తూ అలా వెళ్ళిపోతున్నాడు సుమంత్. దగ్గరగా.. దూరంగా, మళ్ళీ రావా లాంటి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అయ్యి నటుడిగా పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా కపట దారి అనే విభిన్న చిత్రంతో తనలో మంచి నటుడు ఉన్నాడు. కొత్తదనం కోసం ప్రయత్నించే హీరో ఉన్నాడు అని అర్థమవుతుంది. కానీ స్టార్ గా ఎందుకు ఎదగలేకపోయాడు. దానికి ముఖ్యంగా నాలుగు కారణాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మొదటి సినిమా ప్రభావం ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి హీరో ఎంట్రీ ఇస్తున్నాడు అంటే ఫ్యాన్స్ లో అంచనాలు ప్రేక్షకుల్లో కొంచెం ఆసక్తి ఎక్కువగానే ఉంటాయి. స్టార్ కెరీర్ లో చాలా కీలకమైనది కానీ సుమంత్ విషయంలో ఫస్ట్ సినిమానే ప్రతికూలం అయిపోయింది.


1987 నుండి హీరో అవుదామని ట్రై చేస్తూ, చాలామంది డైరెక్టర్ తో సంప్రదింపులు జరిపారు. అయితే, రాంగోపాల్ వర్మను సుమంత్ మొదటి సినిమాగా ఎంచుకోవడం నాగార్జున చేసిన అతి పెద్ద తప్పు. వర్మ వండర్ క్రియేటివ్ డైరెక్టర్ కాదు. ఆ తరువాత బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేశాడు. 1997లో తాను హీరో కావాలని ప్రయత్నాలు ప్రారంభించినప్పటి నుంచి 2003లో వచ్చిన సత్యం సినిమా వరకు దాాదాపు 20 సినిమాల వరకు రిజెక్ట్ చేశాడు సుమంత్. ఆ సినిమాల లిస్ట్ లో చాలా వరకు హిట్ మూవీసే ఉన్నాయని స్వయంగా సుమంత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తొలిప్రేమ సినిమాతో సుమంత్ ని పరిచయంచేయాలని సన్నాహాలు జరిగాయి. కానీ అది నాగార్జున రిజెక్ట్ చేశాడు. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చేసి సూపర్ హిట్ సాధించాడు. దీంతో పాటు నువ్వెకావాలి, నువ్వువస్తావని, మనసంతానువ్వె, ఇడియట్ వంటి సినిమాలను రిజెక్ట్ చేశాడు సుమంత్. సినిమా ఇండస్ట్రీలో ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కాస్త అదృష్టం లేకపోతే అవన్నీ వృధా అయినట్టే.. సుమంత్ కి ఈ అదృష్టం కలిసి రాలేదు. ఇది నిజంగా సుమంత్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మహేష్ బాబు అతడు మూవీలో బ్రహ్మనందం పేరేంటే మీకు గుర్తుకుందా ?

హీరో సూర్య చిల్ట్రన్స్ ఎక్కడ చదువుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading