ప్రతి ఒక్కరి జీవితంలోకి ఎప్పుడో ఒకప్పుడు ప్రేమ ప్రవేశిస్తుంది. అయితే కొందరు ఆ ప్రేమను తమ జీవితంలోకి ఆహ్వానిస్తే…. మరి కొందరు మాత్రం రిజెక్ట్ చేస్తారు. తమకు ప్రేమతో దోమా పట్టవని చెబుతారు. అవతలివారు తమను ఎంత ప్రేమిస్తున్నా… ఆరాధిస్తున్నా అస్సలు పట్టించుకోరు. అయితే దాని వెనక కొన్ని కారణాలు ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Advertisement
1) జీవితంలో అప్పటికే మరొకరి చేతిలో ప్రేమ పేరుతో మోసపోయిన వారు మళ్లీ ప్రేమలో పడేందుకు అస్సలు ఇష్టపడరట. అందువల్లే వారిని ఎంత ప్రేమించినా కూడా వారు వద్దనే చెబుతారట.
2) కుటుంబ సమస్యలు…. బరువు బాధ్యతల కారణంగా కొంతమంది ప్రేమ దోమ లాంటివి తమకు పట్టవని చెబుతుంటారు. ప్రేమించడానికి.. వారికి దగ్గర అవ్వడానికి మాత్రం అస్సలు ఇష్టపడరట.
Advertisement
3) కొంతమంది తల్లిదండ్రులే తమ ప్రపంచమని భావిస్తారు. ఒకవేళ ప్రేమలో పడితే వాళ్లు ఇబ్బంది పడతారేమో…. నా నావల్ల వాళ్లకి ఎలాంటి ఇబ్బందు కలగవద్దు అనే ఉద్దేశంతో కూడా ప్రేమించడానికి దూరంగా ఉంటారట.
4) ప్రేమించే వారిలో లోపాలను వెతికేవారు సైతం సింగిల్ గానే ఉండాలని ఇష్టపడతారట. ఏ చిన్న లోపం కనిపించినా వాళ్ళని రిజెక్ట్ చేస్తారట. తనకు ప్రేమపై నమ్మకం లేదని చెప్పి ఒంటరిగానే ఉండేందుకు ఇష్టపడతారట.
5) కొంతమందికి అసలు ప్రేమ అంటేనే తెలియని ఆందోళన కలుగుతుందట. దాంతో ఇవన్నీ అవసరమా అనే ఉద్దేశ్యం తో తమను ఎవరైనా ప్రేమించినా నో చెబుతారట.
Also read :సిల్వర్ స్క్రీన్ పై గ్యాంగ్‌స్టర్లుగా నటించి మెప్పించింది వీరే..!