Home » వ్యాలిడిటీ 28 రోజులే ఎందుకు?.. ఈ డౌట్ మీకూ వచ్చే ఉంటుంది.. అసలు కారణం ఇదే..!

వ్యాలిడిటీ 28 రోజులే ఎందుకు?.. ఈ డౌట్ మీకూ వచ్చే ఉంటుంది.. అసలు కారణం ఇదే..!

by Bunty
Ad

ప్రస్తుత కాలంలో ఫోన్ల వాడకం ప్రస్తుతం విపరీతంగా పెరిగింది. కానీ మితిమీరిన ఫోన్ల వాడకం ఎన్నో అనర్ధాలకు దారితీస్తోంది. దీనికి తోడు ఫోన్లను బాత్రూంలో కూడా వాడకుండా ఉండలేకపోతున్నారు. ఒకప్పుడు ఊరికి ఒకటో లేదా రెండో ఫోన్లు ఉండేవి. రానురాను ఇంటికో ఫోన్ వచ్చింది. కాదండి, ఒక్కొక్కరికి రెండు ఫోన్లు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా 28 రోజుల వ్యాలిడిటీ తోనే రీఛార్జ్ ప్లాన్స్ ఎందుకు చేస్తారు? వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

దీని వెనుక పెద్ద కథే ఉంది. 30 రోజులకు బదులుగా 28 రోజులకు ప్రీపెయిడ్ ప్లాన్లను అందించడం ద్వారా ఈ టెలికాం కంపెనీలు భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. 12 నెలల x 28 రోజుల వ్యాలీడిటీ 336 రోజులకు వస్తుంది. అంతే 365 రోజులు / సంవత్సరానికి 29 రోజులు తక్కువ. మనం చేసే రీఛార్జ్ లో 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే లభిస్తుంది. మిగతా 29 రోజులకు మరో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

అంటే ఏడాదికి 13 సార్లు. నెలవారి రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ 13వ రీఛార్జ్ లో రిలయన్స్, జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికాం ఆపరేటర్లు కోట్లాది రూపాయల డబ్బును అర్జించారని తెలిస్తే మనం ఆశ్చర్యపోతారు. 13వ రీఛార్జ్ లో ఎయిర్టెల్ దాదాపు రూ. 5415 కోట్లు సంపాదిస్తుంది. ఇదే లెక్కతో రిలయన్స్, జియో, వోడాఫోన్-ఐడియా 13వ నెలలో వరసగా రూ. 6168 కోట్లు, రూ. 2934 కోట్లు అర్జించాయి. ఇక మనం మూడు నెలలకు రీఛార్జి చేసుకున్న, 90 రోజులకు బదులుగా 84 రోజుల చెల్లుబాటును అందించే త్రైమాసిక ప్లాన్ లకు కూడా ఇదే లెక్క వర్తిస్తుంది. త్రైమాసిక ప్లాన్ లను తీసుకునే సబ్ స్క్రైబర్ లు నాలుగవ రీఛార్జ్ పై సంవత్సరానికి 29 రోజులు మిగిలి ఉన్న 336 రోజుల సేవను మాత్రమే పొందుతారు.

READ ALSO : ఇంగ్లండ్‌ను వణికిస్తున్న పాక్ మిస్టరీ స్పిన్నర్! ఎవరీ అబ్రార్?

Visitors Are Also Reading