నటసింహం నందమూరి బాలయ్య అంటే సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీరామారావు నటవారసుడుగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. వరుస హిట్ లతో బాలయ్య స్టార్ హీరోగా ఎదిగారు. స్టార్ హీరోలు చిరంజీవి నాగార్జున వెంకటేష్ లతో పోటీపడ్డారు. రీసెంట్ గా అఖండ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.
ALSO READ : 40 ఏళ్లు దాటిన మహిళలు భర్త దగ్గర ఇదే కోరుకుంటారట..!!
Advertisement
ఇదిలా ఉంటే బాలయ్య సినిమా లైఫ్ గురించి ప్రతిఒక్కరికీ తెలుసు కానీ ఆయన రియల్ లైఫ్ గురించి ఎవ్వరికీ తెలియదు. బాలయ్య సతీమణి పేరు వసుంధర. అయితే చాలా మంది వసుంధర రామోజీరావు కూతురు అని అనుకుంటారు. అందువల్లే ఈనాడు పేపర్ లో ఓ పేజికీ వసుంధర అనే పేరు పెట్టారని కూడా టాక్ ఉంది. అయితే అది వాస్తవం కాదు. వసుంధర రామోజీరావుకు అత్యంత సన్నిహితులు అయిన సూర్యరావు కుమార్తె.
Advertisement
అయితే కొద్దిరోజుల పాటూ వసుంధర రామోజీరావు ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఓ రోజు రామోజీరావుతో సమావేశంలో ఉన్నప్పుడు వసుంధర టీ తీసుకువచ్చి ఇచ్చారు. దాంతో ఎన్టీఆర్ ఆ అమ్మాయి వివరాలను అడిగారట. ఇక వసుంధర తండ్రి ఎస్ఆర్ఎమ్టీ అధినేతగా వ్యాపారవేత్తగా అప్పటికే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.
ఇక ఎన్టీఆర్ రామోజీరావుల మీటింగ్ లో బాలయ్య పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. రామోజీరావు బాలయ్యకు వసుంధరను ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ కి సలహాఇచ్చారు. ఇక వారం రోజుల్లో రామోజీరావు ఇంట్లోనే పెళ్లి చూపులు జరిగాయి. లక్షల్లో కట్నంతో పాటూ బాలయ్యకు కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. ఇదిలా ఉంటే బాలయ్య పెళ్లిరోజున ఎన్టీఆర్, హరికృష్ణ పార్టీ ప్రచారంలో ఉన్నారు. దాంతో ఇద్దరూ పెళ్లికి హాజరవ్వలేదు.
ALSO READ :నిహారిక, చైతన్య మధ్య చిచ్చు పెట్టింది అతనేనా..?