Home » Chiranjeevi: మెగా ఫ్యామిలీ ఒకే చోట పండుగలను చేసుకోవడం వెనుక కారణం ఏమిటి..?

Chiranjeevi: మెగా ఫ్యామిలీ ఒకే చోట పండుగలను చేసుకోవడం వెనుక కారణం ఏమిటి..?

by Sravya
Ad

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు చాలామంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి కూడా వచ్చారు. అలానే నేటితరం హీరోలకి చిరంజీవి ఆదర్శం. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి వార్తలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మనకి కనబడుతూ ఉంటాయి నటనపరంగా ఎవరికైతే మంచి ఇష్టం ఉంటుందో అటువంటి వాళ్ళని బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు చిరంజీవి. ఇటీవల చిరంజీవి విజయ్ దేవరకొండ తో కలిసి ఒక చిట్ చాట్ చేశారు. త్వరలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు మనకి తెలిసిందే.

Advertisement

ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి చేసినటువంటి చిట్ చాట్ లో భాగంగా దేవరకొండ చిరంజీవిని కొన్ని ప్రశ్నలు అడిగారు విజయ్ దేవరకొండ ఆయనని ప్రశ్నిస్తూ మీరు ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా మిడిల్ క్లాస్ వ్యక్తిగా వచ్చారు మీరు స్టార్ హీరోగా మారారు అయితే మీరు ఈ హోదాలని అందుకోకముందు మీకు ఫ్యామిలీ స్టార్ ఎవరు అనే ప్రశ్న వేశారు. నా ఫ్యామిలీ స్టార్ మా నాన్న అని చిరంజీవి చెప్పారు. తన తండ్రి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చే వాళ్ళట. అందరిని ఎలా కలుపుకోవాలి బంధువులకి ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వాలి అనేవి చెప్పారట.

Advertisement

Also read:

ఇవన్నీ కూడా నాన్న దగ్గర నుండి నేర్చుకున్నాను అని చిరంజీవి అన్నారు. మనిషికి మనిషికి ఎన్నో రకాల విభేదాలు ఉండొచ్చు కానీ అందరూ ఒకే చోట కలిసి ఒక పండగనే జరుపుకుంటే వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు ఉన్న తొలగిపోతాయి. బంధాలు బలపడతాయి అని చిరంజీవి అన్నారు. మొన్న సంక్రాంతి వేడుకలకి మా ఫ్యామిలీ బెంగళూరులో జరుపుకున్న ఫోటోలను చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని చెప్పారు. ఒకే చోట అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని అందరూ ఆశ్చర్యపోయారని ఆ ఫోటో అందర్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చిరంజీవి అన్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading