Home » WTC లో ఇండియా ఘోర ఓటమికి కారణాలు ఇవే..

WTC లో ఇండియా ఘోర ఓటమికి కారణాలు ఇవే..

by Bunty
Ad

ప్రపంచ టెస్ట్ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. ఇంగ్లాండ్ ఓవల్ వేదికగా జరిగిన తుది సమరంలో ఏ మాత్రం టగ్ ఆఫ్ వార్ పర్ఫామెన్స్ ఇవ్వకుండా చేతులెత్తేసింది. వరుసగా రెండోసారి డబ్ల్యుటిసి ఫైనల్స్ కు చేరిన భారత్… మరోసారి భంగపాటుకు గురైంది. ఓవల్ టెస్ట్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 296, రెండో ఇన్నింగ్స్ లో 234 ఆల్ అవుట్ అయింది. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 469 పరుగుల భారీ స్కోర్ చేసి ఆల్ అవుట్ అయింది. రెండో ఇన్నింగ్స్ 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి డిక్లేర్డ్ అయింది.

Advertisement

ఆస్ట్రేలియా చేసిన 444 పరుగుల రన్స్ చేదనలో 164 పరుగులకు మూడు వికెట్లతో లాస్ట్ డే ఆట ప్రారంభించిన భారత్ కుప్పకూలిపోయింది. మొదటి సెషన్ లో 70 పరుగులు జత చేసి మిగతా 7 వికెట్లను ఆస్ట్రేలియాకు సమర్పించేసింది. దీంతో 209 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఘోర పరాజయం పాలైంది టీమిండియా. అయితే ఈ ఓటమికి మూడు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది రవిచంద్రన్ అశ్విన్ ను ఈ మ్యాచ్ లో ఆడించకపోవడం. ఈ మ్యాచ్లో అశ్విన్ ను ఆడిస్తే… ఆస్ట్రేలియా అంత భారీగా స్కోర్ చేయకపోయేది.

Advertisement

ఆస్ట్రేలియా జట్టులో ఎక్కువమంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నప్పటికీ అశ్విన్ ను తీసుకోక రోహిత్ శర్మ పెద్ద మిస్టేక్ చేశాడు. అలాగే టాస్ మొదట గెలిచిన రోహిత్ శర్మ… మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకొని రెండో తప్పిదం చేశాడు. మొదట బ్యాటింగ్ చేస్తే టీమిండియా పరిస్థితి వేరేలా ఉండేది. టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉండేది. ఇక మూడోది.. టీమిండియా బ్యాటింగ్ పర్ఫామెన్స్. రహానే మినహా టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కోహ్లీ మాత్రం కాస్త పర్వాలేదనిపించాడు. ఈ మూడు మిస్టేక్ వల్ల.. టీమిండియా ఓటమిపాలైంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

అప్సర కేసులో అదిరిపోయే ట్విస్ట్! ఇది అస్సలు ఊహించలే కదా ?

4 గురు పెళ్ళాలు ఉన్నా… ఒంటరోడే నా దేవుడు – శ్రీ రెడ్డి

రేణు దేశాయ్‌ – పవన్ కళ్యాణ్ విడిపోవడానికి నాగబాబు కారణమా?

Visitors Are Also Reading