పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు మన పెద్దలు. దీనికి తగినట్టుగానే భార్యాభర్తలు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి చేసే సమయంలో అటు ఏడు తరాలు… ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేయాలని అంటారు. కానీ ప్రస్తుత కాలంలో అవేవీ చూడకుండా అమ్మాయి, అబ్బాయి ఇద్దరు నచ్చితే ఓకే అని పెళ్లిళ్లు చేసేస్తున్నారు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చూస్తారు. అది వయస్సు.
Advertisement
అబ్బాయి కన్నా అమ్మాయి వయసు చిన్నదిగా ఉండేటట్లు చూస్తారు మన పెద్దలు. దీనికి గల కారణం… అబ్బాయిల కన్నా అమ్మాయిలు శారీరకంగానూ, మానసికంగానూ రెండింతలు ముందుంటారు. దీంతో అబ్బాయిల కన్నా అమ్మాయిలు బాడీ పరంగా, మెచ్యూరిటీ పరంగా కాస్త ముందుంటారు. పురుషులకన్నా స్త్రీలు అన్ని విషయాలలో కాస్త ముందే ఉంటారు. దీంతో స్త్రీలకు వృద్ధాప్యం పురుషుల కన్నా నాలుగు సంవత్సరాలు ముందుగానే వస్తుంది. కానీ మగవారికి వయస్సు ఎక్కువ అయినప్పటికీ వృద్ధాప్యం కాస్త ఆలస్యంగా వస్తుంది. అందువల్లనే సమాన వయసు ఉన్న వారిని చేసుకున్న, ఎక్కువ వయసు ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకున్న వారి కన్నా అబ్బాయిలకు వృద్ధాప్యం ముందుగా వస్తుంది.
Advertisement
వృద్ధాప్య సమయంలో భర్త భార్యకు ఎలాంటి సేవలు చేయలేడు. అందువల్లనే తక్కువ వయసున్న స్త్రీలను చేసుకోవడం వల్ల అమ్మాయిలకు వృద్ధాప్యం ముందుగా వస్తుంది. భార్యలు కుటుంబం కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటారు. ఎన్నింటినో వదులుకొని తమ కుటుంబం కోసం కష్టపడుతుంటారు. అందువల్ల భార్య కన్నా భర్త పెద్దవాడు అవడంతో కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందువలన పెళ్లి సమయంలో అమ్మాయిలకు తక్కువ వయసు, అబ్బాయిలకు కాస్త ఎక్కువ వయసు ఉండేలా చూసుకుని వివాహం జరిపించాలి.
ఇవి కూడా చదవండి
కళ్ల కలక ఎందుకు వస్తుంది? ఈ కంటి ఇన్ఫెక్షన్ రాకూడదంటే ఏం చేయాలి…?
“BRO”లో అంబటి రాంబాబు..ఇదేందయ్యా ఇది !
సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!