పాముని చూస్తే మనందరికీ ఒకరకమైన భయం ఉంటుంది. ఎందుకంటే అది విష జంతువు కాబట్టి. మనలని చూస్తే లేదా మనం దాని దారికి అడ్డు వచ్చినా మనలని కాటేస్తుంది. విషం మన శరీరంలోకి వస్తే మనకి ప్రమాదం కాబట్టి మనం కూడా దానికి వీలైనంత దూరంగా ఉంటాం. అయితే.. పాములు గర్భవతులను కాటెయ్యవు అని అంటూ ఉంటారు.
Advertisement
ఇది నిజమేనా అన్న సందేహం చాలా మందికి కలుగుతూ ఉంటుంది. నిజానికి పాములకు ఈ బేధాలేమీ ఉండవు. తమకు ఎవరు అడ్డుగా తగిలితే వారిని కాటు వేస్తూ ఉంటాయి. చివరికి తమ దారికి రాయి, రప్పా అడ్డు వచ్చిన వాటిపై కూడా కాటు వేసి ముందుకు వెళ్లిపోతుంటాయి. మరి గర్భవతులను ఎందుకు కాటెయ్యవు? అన్న డౌట్ వస్తుంది. దీనికి పురాణంలో ఒక కథ ఉంది. ఒకప్పుడు ఒక గర్భిణీ పరమ శివుని కోసం తపస్సు చేసింది.
Advertisement
అయితే పాముల కారణంగా ఆమె తపస్సుకు భంగం వాటిల్లింది. దీనితో ఆమె గర్భంలో ఉన్న బిడ్డ పాములను శపించింది. ఏవైతే గర్భవతులను చూస్తాయో వాటికీ కళ్ళు కనిపించవని శపించింది. దీనితో గర్భవతులు ఎదురొస్తే పాములకు కళ్ళు కనిపించవని, అందుకే అవి కాటెయ్యలేవని చెబుతుంటారు. అంతే కాదు సర్ప జాతికి ఉన్న ఇంద్రియ శక్తీ కారణంగా వాటికి స్త్రీలు గర్భవతో కాదో తెలుసుకోగలుగుతాయట.
మరిన్ని ముఖ్య వార్తలు:
వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !
Shubman Gill : టీమిండియా కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ?
2007 లో ధోనీనే కెప్టెన్గా ఎందుకు BCCI నియమించింది ?