Home » రచ్చ సినిమా షూటింగ్ లో ఏం జరిగింది..? తమన్నా రామ్ చరణ్ తో మాట్లాడలేదు ఎందుకు..?

రచ్చ సినిమా షూటింగ్ లో ఏం జరిగింది..? తమన్నా రామ్ చరణ్ తో మాట్లాడలేదు ఎందుకు..?

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం వారసుల హవా కొనసాగుతుంది. ప్రధానంగా నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ సత్తా చూపిస్తూ ముందుకు వెళ్లుతుంటే.. ఘటమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా తన స్థాయిని పెంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్-పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన చిరుత మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు చరణ్. వరసగా మంచి సక్సెస్ లను సాధిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement

చిరుత తరువాత మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ఆ తరువాత ఆరెంజ్ మూవీ ఫ్లాప్ తరువాత సంపత్ నంది దర్శకత్వలో వచ్చిన రచ్చ మూవీ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన తమ్మనా కొన్ని విషయాల్లో రామ్ చరణ్ ని డామినేట్ చేసేదట. ప్రధానంగా సాంగ్ షూట్ చేసేటప్పుడు రిహార్సల్స్ రామ్ చరణ్ తో పాటు చేయకుండా తను వేరే సపరేట్ గా ప్రాక్టీస్ చేసేదట. రామ్ చరణ్ కూడా అవేం పట్టించుకోకుండా తన డ్యాన్స్ తను చేస్తూ ముందుకు సాగేవాడట.

Advertisement

 

అయితే ఒకరోజు సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయిన తరువాత రామ్ చరణ్ తో కలిసి చాలా బాగా మాట్లాడుతూ.. షూటింగ్ రిహార్సల్స్ ను కూడా చేసేదట. అయితే ముందు రోజు అలా ఎందుకు చేసింది అంటే.. రామ్ చరణ్ చిరంజీవి వాళ్ల అబ్బాయి కాబట్టి తన ముందు నుంచే దూరంగా ఉంటూ వచ్చిందట. కానీ ఆమె అలా ఉండటాన్ని చూసే వాళ్లకి రామ్ చరణ్ ని డామినేషన్ చేస్తున్నట్టు కనిపించే సరికి తను అలా చేయకూడదని మళ్లీ రామ్ చరణ్ తో కలిసి మాట్లాడి అతనితో పాటు చనువుగా ఉంటూ సినిమా షూటింగ్ పూర్తి చేసిందట. మొత్తానికి రామ్ చరణ్ కి తమన్నా మంచి ఫ్రెండ్ గా మారిపోయింది.

Also Read : కల్కి మూవీలో నటించనున్న మరో టాలీవుడ్ సీనియర్ హీరో..?

Visitors Are Also Reading