Home » తమిళ హీరో దళపతి సినిమాలు ఆడనివ్వకుండా ఎందుకు జయలలిత అడ్డుకున్నారు ?

తమిళ హీరో దళపతి సినిమాలు ఆడనివ్వకుండా ఎందుకు జయలలిత అడ్డుకున్నారు ?

by Anji
Published: Last Updated on
Ad

తమిళ స్టార్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా ఆయన కొత్త పార్టీ పెట్టి తమిళనాట సంచలనం సృష్టించారు. తమిళ వెట్రి కళగం అని పార్టీ పేరును ప్రకటించారు విజయ్. ఈ విషయం ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది. ఆయన పార్టీ పెట్టే సమయంలో ఓ గొప్ప మాట చెప్పారు. ఇన్నాళ్లు నాపై అభిమానం చూపిన మీకు.. ఏదైనా చేయాలనే ఉంది. అది కచ్చితంగా చేస్తా. మీ కాలికి చెప్పులా ఉండటానికి నేను వెనుకాడను. కొంత ఓపిక పట్టండి అని.. లియో విజయోత్సవ వేడుకలో చెప్పారు విజయ్. 

vijay-dhalapathy

Advertisement

 

ఇప్పుడు ప్రజా సేవ చేసేందుకు ఆయన రంగంలోకి దిగుతున్నారు. రాజకీయాల కోసం ఒక యాప్ ను కూడా లాంచ్ చేయబోతున్నారు. తమిళగ వెట్రీ కళగం ఇందులో తమిళగ అంటే తమిళులు అని.. వెట్రీ అంటే విజయం.. కళగ అంటే పార్టీ అని అర్థం. వెట్రీ అనే సినిమాతో తొలిసారి చైల్డ్ ఆర్టీస్ట్ గా నటించాడు విజయ్. ఈ సినిమాకి దర్శకుడు విజయ్ తండ్రి చంద్రశేఖర్ కావడం విశేషం. తన తండ్రి టాప్ డైరెక్టర్ గా ఎదిగిన తీరు.. రజినీకాంత్, విజయ్ కాంత్ యాక్షన్స్ చూసి తాను కూడా హీరో కావాలనుకున్నాడు విజయ్. చైల్డ్ ఆర్టీస్ట్ అవసరం అవ్వడంతో విజయ్ ని తీసుకున్నాడు తండ్రి చంద్రశేఖర్.

Advertisement

విజయ్ హీరో కావాలనుకుంటే.. తల్లి, దండ్రులు మాత్రం చదువుకోవాలని సూచించారు. అయితే విజయ్ అలిగిపోయి థియేటర్లలో సినిమా చూశాడు. ఒకే సినిమాను 4 షోలు చూడటం గమనార్హం. అప్పుడు తండ్రి వెళ్లి తీసుకొచ్చాడు.  మంచి ఆస్తి.. కారు ఇల్లు కావాలంటే ఎంత సంపాదించాలని అడిగాడు తల్లిని. తల్లి కోటి కావాలంది. నేను 10 కోట్లు సంపాదిస్తాను.. కానీ హీరో కావాలని చెప్పాడు. తండ్రి శిక్షణ ఇచ్చాడు. అసలు హీరోగా విజయ్ పనికి రాడని.. తన కొడుకుని హీరోగా ఎలా తీసుకున్నాడని విమర్శించారు.  తన కొడుకును హీరోగా నిలబెట్టాలని.. తన ఇంటిని తాకట్టు పెట్టేశారు. నా కొడుకును హీరోగా నిలబెట్టాలి. నీకు మంచి పాత్ర ఉంది అని విజయ్ కాంత్ కి చెప్పాడు చంద్రశేఖర్.  సిందూర పాండ్య  సినిమాలో పెదరాయుడు పాత్రలో విజయ్ కాంత్ నటించాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది.  ఆ సినిమా తరువాత కొత్త దర్శకులు కూడా విజయ్ తో సినిమా తీసేందుకు ముందుకొచ్చారు. ఆ తరువాత కోలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా పేరు తెచ్చుకున్నారు విజయ్.

 

జయలలిత గ్యాప్ ను ఎవ్వరూ పూడ్చలేరని.. జయలలిత విజయ్ ని తొక్కేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. జయలలిత సీఎం అయితే విజయ్ కి సినిమా థియేటర్లు కూడా దొరికేవి కావు. అన్నా డీఎంకే అనుబంధ నిర్మాతలు విజయ్ తో సినిమాలు తీసేవారు కాదు. డీఎంకే కి ఓటు వేయాలని.. జయలలిత పాలనలో అవినీతి ఎక్కువ అయిందని కామెంట్ చేశాడు విజయ్. జయలలిత సీఎంగా ఉంటే చాలు.. విజయ్ సినిమాలను ఆడనివ్వకుండా చేసేందుకు తెగ ప్రయత్నం చేసేది.  పొలిటికల్ గా కామెంట్ చేస్తే.. కెరీర్ కి నష్టం అని భావించాడు. ఐదేళ్లపాటు 10 సినిమాలు ఫ్లాప్ అయినా నిరుత్సాహ పడలేదు. మళ్లీ డైరెక్టర్ శంకర్ త్రీ ఇడియట్స్ ని తమిళంలో రీమేక్ చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో మళ్లీ వెనుదిరిగి చూడలేదు. తుపాకీతో బిగ్గెస్ట్ స్టార్ అయ్యారు. రజినీకాంత్ తరువాత తమిళ బాక్సాఫీస్ షేక్ చేసింది ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ అనే చెప్పాలి.  2026 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అయ్యేందుకు ప్రయత్నించనున్నారు విజయ్.  ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత తరువాత పాపులారిటీ సంపాదించనున్నారు హీరో విజయ్.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading