Home » చిరంజీవితో విజయశాంతి 20 ఏళ్లుగా ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో తెలుసా ? ఆ విషయంలో చిరు…!

చిరంజీవితో విజయశాంతి 20 ఏళ్లుగా ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో తెలుసా ? ఆ విషయంలో చిరు…!

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో చాలామంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. కానీ అతి కొద్దిమంది మాత్రమే హీరోలతో సమానంగా పేరు సంపాదించుకుంటారు. అలాంటి హీరోయిన్లలో విజయశాంతి ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. విజయశాంతి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి లేడీ అమితా బచ్చన్ గా పేరు సంపాదించుకున్నారు. ఓ వైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.

Advertisement

చిరంజీవి, నాగార్జున, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోల పక్కన సినిమాలు చేసి విజయశాంతి చాలా కాలం పాటూ స్టార్ హీరోయిన్ గా రాణించారు. అంతే కాకుండా తన నటన తో ఇండస్ట్రీలో ఎన్నో అవార్డులను అందుకున్నారు. విజయశాంతి కర్తవ్యం, ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలతో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. కర్తవ్యం సినిమా కు విజయశాంతి నేషనల్ అవార్డును అందుకున్నారు.

Advertisement

VIJAYASHANTHI

VIJAYASHANTHI

అంతేకాకుండా ప్రతిఘటన సినిమాలకు గాను నంది అవార్డును అందుకున్నారు. వరుస సినిమాలు చేస్తున్న స‌మ‌యంలోనే విజయశాంతి తెలంగాణ ఉద్యమానికి ముందు రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం బిజెపి లో కీలక నాయకురాలిగా వ్యవహరిస్తున్న విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే విజయశాంతి చిరంజీవి తో దాదాపుగా 19 సినిమాల్లో నటించారు. అప్పట్లో వీరిని హిట్ పెయిర్ అనేవారు. వీరిద్దరి మధ్య ఎంతో అనుబంధం కూడా ఉండేది. కానీ చిరంజీవి విజయశాంతి దాదాపు 20 ఏళ్ల పాటూ మాట్లాడుకోలేదు. ఈ విషయంపై విజయశాంతి ఇంట‌ర్వ్యూలో స్పందించారు. ఒకసారి రాజకీయాల్లోకి వస్తే ప్రత్యర్థులుగా ఉన్న తర్వాత విభేదాలు వస్తాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సినిమా పరిశ్రమ నుండి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కానీ ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయం చేయకపోయినా స్పందించి ఉంటే బాగుండేదని అనిపించింది అప్పటినుండి 20 ఏళ్ల పాటు మాట్లాడలేదని అన్నారు.

ALSO READ : స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Visitors Are Also Reading