Home » స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

by AJAY
Ad

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా ఈ చిత్రంలో కన్నడ హీరో ఉపేంద్ర విలన్ పాత్రలో నటించారు. తండ్రి సెంటిమెంట్ నేప‌థ్యంలో ఈ సినిమా తెరకెక్కిన‌ సంగతి తెలిసిందే. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన‌ ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం సూపర్ హిట్ అందుకోలేకపోయింది.

Advertisement

ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా రావడం…ఆ అంచనాలను రీచ్ కాలేకపోవడంతో మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయిన‌ప్ప‌టికీ ఈ సినిమాకు కొంత మంది అభిమానులు ఉన్నారు. సినిమా ఎప్పుడు వ‌చ్చినా టీవీకి అతుక్కుపోతారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తండ్రిని కోల్పోయిన తర్వాత ఆస్తులు అన్నీ కోల్పోయి రోడ్డున పడతాడు. అల్లు అర్జున్ తో పాటు అత‌డి అన్న‌ వెన్నెల కిషోర్ కు కూడా అదే పరిస్థితి వస్తుంది.

Advertisement

అయితే వెన్నెల కిషోర్ కు అప్పటికే పెళ్లై ఓ కూతురు కూడా ఉంటుంది. ఆస్తులన్నీ ఒకేసారి కోల్పోవడంతో వెన్నెల కిషోర్ మతి స్థిమితం కోల్పోతాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూతురు గా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ చాలా క్యూట్ గా ఉంటుంది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు బేబీ వర్నిక. ఈ సినిమాకు బేబీ వర్నిక హైలెట్ అనే చెప్పాలి. సినిమాలో అల్లు అర్జున్ వర్ణిక మధ్యన ఎక్కువ ఎమోషనల్ సీన్ లు ఉంటాయి. అల్లు అర్జున్ ను బాబాయ్ అంటూ వర్నిక ఎప్పుడూ వెంటే ఉంటుంది. అంతే కాకుండా ఓ పాట‌లో వ‌ర్నిక ఎక్స్ప్రెష‌న్స్ కు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు.

అయితే ఈ సినిమా తర్వాత వర్ణిక ఏ సినిమాలో కూడా కనిపించలేదు. కానీ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా వచ్చినప్పుడు వ‌ర్నిక‌ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఇదిలా ఉంటే సినిమాలకు దూరమైన వర్ణిక ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. వ‌ర్నిక పేరుతో సోష‌ల్ మీడియా ఖాతా తెరిచిన ఆమె పేరెంట్స్ వ‌ర్నిక లేటెస్ట్ ఫోటోల‌ను ఫేర్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోల‌ను నెటిజ‌న్లు వర్ణిక ఇంతలా మారిపోయిందా అని షాక్ అవుతున్నారు.

ALSO READ : భార్య భర్తల మధ్య కండిషన్స్ ఉంటే జరిగే నష్టాలు అవేనా…?

Visitors Are Also Reading