అక్కినేని ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోని అతిపెద్ద కుటుంబాలలో వీరి కుటుంబం కూడా ఒకటి. టాలీవుడ్ కి రెండు కల్లుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తమతమ వారసత్వ సామ్రాజ్యాలు నిర్మించిపోయారు. ఏఎన్నార్ లెగసీని కొడుకు నాగార్జున ముందుకు తీసుకెళ్లారు. టాప్ స్టార్ గా ఎదిగి తండ్రి వారసత్వం నిలబెట్టారు. నాగార్జున తర్వాత ఆ పరిశ్రమకు పరిచయమైన సుమంత్, సుశాంత్ ఏమంత ప్రభావం చూపించలేకపోతున్నారు.
Also Read: బాలీవుడ్ స్టార్ హీరోతో అల్లు అర్జున్ మల్టీస్టారర్ మూవీ.. దర్శకుడు ఎవరంటే..?
Advertisement
ఇకపోతే అసలు విషయంలోకి వెళితే, అక్కినేని ఫ్యామిలీలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య ఇలా అందరి పేర్లకు ముందు నాగ అనే పదం ఉంటుంది. అలా వారి పేర్లలో నాగా కలిసి ఉండడానికి గల కారణం ఏంటో తాజాగా నాగార్జున చెప్పుకొచ్చారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు వారి అమ్మ కడుపులో ఉన్నప్పుడు వారికి నాగుపాము కలలోకి వచ్చేదట. ఆ తర్వాత నాగేశ్వరరావు పుట్టిన తర్వాత కూడా తరచూ పాము పిల్లలు కనిపించేట. దాంతో ఆయనకు నాగేశ్వరరావు అని నామకరణం చేశారట.
Advertisement
అలా నాగార్జున, నాగచైతన్య పేర్ల ముందు కూడా నాగ అనే పదాన్ని యాడ్ చేశారట. ఇకపోతే అఖిల్ పేరులో నాగ అన్న పదం లేదేంటి అన్న విషయానికి వస్తే ఆ పేరును కూడా వాళ్ళ నానమ్మ సూచించారట. అదేవిధంగా నాగార్జున సోదరి సుశీల పేరులో కూడా నాగ అన్న పదం యాడ్ చేయడంతో ఆమె పేరు నాగ సుశీల గా మార్చుకుందట. అయితే మొదట నాగచైతన్య పేరుని చైతన్య అని నామకరణం చేయడంతో ఆ తర్వాత పెద్దావిడ సూచన మేరకు నాగ అనే పదం యాడ్ చేయడంతో మొత్తం నాగచైతన్య పేరుని యాడ్ చేశారట. అలా అని చైతన్య పేరు కా స్త నాగచైతన్యగా మారిపోయింది. అఖిల్ పేరులో నాగ అన్న పదం లేదు అన్న విషయానికొస్తే, ఒకసారి బిగ్ బాస్ షో లోను ఇదే విషయం ప్రస్తావించారు.
READ ALSO : ఆస్పత్రి బెడ్ పైన ఉన్న పంత్ కు BCCI శుభవార్త..రూ.21 కోట్లు ఇవ్వాలని నిర్ణయం!