Home » వృద్ధాప్యాన్ని కనిపించకుండా చేసే వైట్ టీ.. ట్రై చేస్తే వదిలిపెట్టరు..!

వృద్ధాప్యాన్ని కనిపించకుండా చేసే వైట్ టీ.. ట్రై చేస్తే వదిలిపెట్టరు..!

by Anji
Ad

ఉదయం లేవగానే టీ లేదా కాఫీ పడనిదే రోజు గడవదు. ఇంకొంత మంది అయితే బెడ్ మీదనే టీ తాగడం అలవాటు. ఇలా టీలో బ్లాక్ టీ, గ్రీన్ టీ, టీ, మసాలా టీ, అల్లం టీ ఇలా ఎన్నో రకాలు వినే ఉంటారు. కానీ ఎప్పుడైనా వైట్ టీ గురించి విన్నారా.. ఎవరూ మాట్లాడి ఉండరు కూడా. కానీ ఈ టీతో వచ్చే బెనిఫిట్స్ మాత్రం అన్నీ ఇన్నీ కావు. ఈ వైట్ టీ గురించి తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు. మరి ఈ వైట్ టీ లో ఉండే పోషకాలు, లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


వైట్ టీలో యాంటీ మైక్రోబయాల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల వ్యాధులు సోకకుండా రక్షణగా నిలుస్తుంది. అంతేకాకుండా వైట్ టీ తాగడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. అలాగే ఈ వైట్ టీలో ఉండే పాలిఫెనాల్స్, ఫైటో న్యూట్రియెంట్స్, పలు రకాల కాటెచిన్స్ ఉంటాయి. అంతేకాకుండా వైట్ టీలో టానిన్లు, ఫ్లోరైడ్లు, ఫ్లేవనాయిడ్లు కూడా ఉంటాయి. వీటి వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. అంతేకాదు ముఖ్యంగా ఈ వైట్ టీ తాగితే వృద్ధాప్య చాయాలను కనిపించనివ్వదు.

Advertisement

Advertisement


క్రమం తప్పకుండా టీ తాగితే వేలాడుతూ ఉండే చర్మం కూడా బిగుతుగా మారి ముడతలు, ఫైన్ లైన్స్ ఏర్పడకుండా చూస్తుంది. ఈ టీ తాగితే యంగ్ గా కూడా కనిపిస్తారు. వైట్ టీతో వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. అలాగే వైట్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన ఆరోగ్యానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ను నియంత్రిస్తుంది. ఉదయం ఈ టీ తాగితే.. రోజంతా యాక్టివ్ గా ఉంటారు. అలసటను దరిచేరనివ్వదు.

Visitors Are Also Reading