Home » కల్కి టీజర్ మొత్తం కమల్ హాసన్నే ఉన్నాడంటూ ట్విస్ట్ ఇచ్చిన నాగ్ అశ్విన్..! ఇంతకీ ఎక్కడా..?

కల్కి టీజర్ మొత్తం కమల్ హాసన్నే ఉన్నాడంటూ ట్విస్ట్ ఇచ్చిన నాగ్ అశ్విన్..! ఇంతకీ ఎక్కడా..?

by Mounika
Published: Last Updated on
Ad

 డార్లింగ్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రాబోతున్న  ప్రాజెక్ట్ కె మీద కేవలం జాతీయ స్థాయిలోనే కాదు… అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.  అమితాబ్, కమల్ హాసన్, దీపిక వంటి అగ్రస్థాయినటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గత రెండు రోజుల క్రితమే  మూవీ మేకర్స్  ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీకి ‘కల్కి 2989  AD’ అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు.

kalki-teaser

Advertisement

 

ఈ టీజర్ లో సినిమా ఎలా ఉండబోతుంది అనేది చూపించారు. వీడియోలో స్టోరీని పెద్దగా చూపించకుండా కేవలం ప్రధాన పాత్రల్ని మాత్రమే చూపించటం  జరిగింది . అయితే ఈ టీజర్లో కమల్  ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఈ గ్లింప్స్‌ కు సంబంధించిన వీడియోను చూస్తుంటే టైం ట్రావెల్ కథ అని అర్థం అవుతోంది. ఇందులో హీరో ఏకంగా 2898వ సంవత్సరానికి వెళ్లేట్టు కనిపిస్తోంది.

శాన్ డియాగోలో జరిగిన కామికాన్ లో ప్రభాస్  కల్కి గ్లింప్స్ని విడుదల చేసే ఈవెంట్లో చిత్రబృందంతోపాటు రానా అక్కడికి వెళ్లాడు. రానానే మొత్తం ‘కల్కి’ టీమ్ని స్టేజీపై పిలిచి అందరికీ పరిచయం చేశాడు. కార్యక్రమంలో భాగంగా గ్లింప్స్ అందరూ ఉన్నారు కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదు ఏంటి అని రానా డైరెక్టర్ నాగ్ అశ్విని ప్రశ్నించడం జరిగింది. రానా ప్రశ్నకు సమాధానంగా నాగ్ అశ్విన్ ” గ్లింప్స్ మొత్తంలో ఆయనే ఉన్నారు. కానీ అది మీకు తెలియదు” అంటూ సమాధానం ఇవ్వడం జరిగింది. దీంతో గ్లింప్స్ ను చూసిన ప్రేక్షకులను సైతం అయోమయంలో పడిపోయారు.  75 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో ఎక్కడా కూడా  కమల్ హాసన్  కనిపించలేదు.

Advertisement

దీనితో సోషల్ మీడియాలో కల్కి సినిమా ఇలాగే ఉండబోతుందంటూ కొత్త కథలు పుట్టుకొచ్చేస్తున్నాయి. కల్కి మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, ఇందులో ఒకరు హీరో కాగా, మరొకరు విలన్ అని అంటున్నారు. ఆ విలన్ కమల్ హాసన్ నే అని, కాకపోతే ప్రభాస్ రూపంలో కనిపిస్తాడనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ టీజర్ మొత్తం ప్రభాస్ కనిపిస్తున్నాడు కాబట్టి అందులో ఉన్నది  ఎవరెవరనేది తెలియకపోవచ్చు. ఇంకా ప్రేక్షకులు ఊహాగానాలు నిజమా.. లేదా..  అనేది కల్కి మూవీ థియేటర్లో వచ్చేవరకు వేచి చూడవలసిందే.

 

మరికొన్ని  ముఖ్యమైన వార్తలు :

నటుడు సముద్రఖని డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సీరియల్ ఏదో తెలుసా..?

సుమతో విడాకుల ఇష్యూ గురించి రాజీవ్ కనకాల ఏమన్నారంటే..?

అలనాటి హీరోయిన్ రాశి కెరీర్ ను నాశనం చేసింది ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading