మెగా కుటుంబం లో మరో జంట విడాకులు తీసుకుంది. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు మెగా డాటర్ కొణిదెల నిహారిక… తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు తాజాగా విడాకులు ఇచ్చింది. గత నెలలోనే వీరిద్దరు విడాకులు తీసుకోగా… ఈ అంశం రెండు రోజుల కిందట బయటపడింది. హైదరాబాద్ లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరికీ విడాకులు మంజూరు అయ్యాయి. దీంతో రెండు రోజులుగా కొణిదల నిహారిక విడాకులు అంశం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.
Advertisement
అలాగే… వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలను కూడా కొంతమంది సెర్చ్ చేస్తున్నారు. కొంతమంది నిహారికది తప్పు అంటే.. మరికొంతమంది మాత్రం జొన్నలగడ్డ వెంకట చైతన్య తప్పు ఉందని వాదిస్తున్నారు. గత ఉగాది పండుగ నుంచి వీరి మధ్య గొడవలు మొదలయ్యాయట. హైదరాబాదులోని ఓ ప్రముఖ పబ్బులో కొణిదల నిహారిక అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే. ఈ అంశం జరిగినప్పటి నుంచి నిహారికకు జొన్నలగడ్డ వెంకట చైతన్య దూరంగా ఉంటున్నారని సమాచారం.
Advertisement
చిన్నచిన్న గొడవలు కాస్త పెద్దదై… విడాకుల వరకు వచ్చింది. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి ఇరుకుటుంబ పెద్దలే కారణమని ఇప్పుడు కొత్తగా చర్చించుకుంటున్నారు. వీరిద్దరి వివాహం జాతకాల ప్రకారం నిర్ణయించిన ముహూర్తానికి జరగలేదట. దీనికి కారణం ఇరు కుటుంబాల పెద్దలట. నిహారిక మరియు జొన్నలగడ్డ వెంకట చైతన్య ల వివాహం అనుకున్న సమయానికంటే చాలా ఆలస్యంగా జరిగిపించారట. అందుకే వీరిద్దరి మధ్య గొడవలు తలెత్తి విడాకుల వరకు వచ్చారని కొంతమంది చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
WI VS IND TOUR : కెప్టెన్గా పాండ్యా.. తెలుగు కుర్రాడికి చోటు
2011 వన్డే వరల్డ్ కప్లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..
Praveen Kumar : టీమిండియా బౌలర్ ప్రవీణ్ కుమార్ కారుకు ప్రమాదం