తెలుగు బుల్లితెర నటిగా ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సాధించింది నటి శ్రీవాణి. ఈమె కేవలం సీరియల్స్ లోనే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చాలా ఫేమస్ అయ్యింది. నిత్యం యూట్యూబ్ లో ఏదో ఒక విధంగా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూనే అభిమానులు అలరిస్తూనే ఉంటుంది శ్రీవాణి. అలా గలగల మాట్లాడే శ్రీవాణి గొంతు మూగబోయిందట. ఆమె ఈ మధ్యకాలంలో చేసిన కొన్ని వీడియోలలో ఆమె గొంతులో మార్పు రావడం మనందరం చూసాం. ఈ విధంగా తన వాయిస్ చేంజ్ కావడంతో చాలామంది సాధారణ జలుబు అని అనుకున్నారు. కానీ ఆమె పూర్తిగా మాట్లాడలేకపోవడంతో డాక్టర్ కు చూపించుకుందట.
Advertisement
దీంతో డాక్టర్ చెప్పిన విషయాలను శ్రీవాణి భర్త వెల్లడించారు.. ఎప్పుడు గలగల మాట్లాడే శ్రీవాణి గొంతు కు కాస్త సీరియస్ అయినట్టు ఆయన చెప్పారు. షూటింగ్ సమయంలో ఆమె గట్టిగా మాట్లాడటం వల్ల,అధిక ఒత్తిడి వల్ల గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినట్టు తెలిపారు. ఒక నెలరోజుల పాటు శ్రీవాణి మాట్లాడకుండా ఉంటేనే ఆ మాట తిరిగి వస్తుందని, లేదంటే తనకు జీవితంలో మాట రాదని డాక్టర్లు చెప్పినట్లు శ్రీవాణి భర్త తెలియజేశారు.
Advertisement
ఈ విధంగా శ్రీవాణి నెల రోజులపాటు మాట్లాడకుండా ఉంటే తన గొంతు తిరిగి వస్తుందని ఎప్పటిలాగే మాట్లాడగలరని అన్నారు. మిమ్మల్ని అలరించే శ్రీవాణి గొంతు రావాలని దేవున్ని ప్రార్థించండి అంటూ ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం శ్రీవాణి భర్త మాట్లాడిన మాటలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. కానీ ఈ మధ్యకాలంలో అందరి ఆశీస్సులతో ఆమె గొంతు మళ్ళీ మామూలు స్థితికి వచ్చిందని తెలుస్తోంది.
also read: