Home » ఆ తప్పు కారణంగానే అక్కినేని ఇంటి కోడలుగా సమంత సెటిల్ కాలేకపోయారా ?

ఆ తప్పు కారణంగానే అక్కినేని ఇంటి కోడలుగా సమంత సెటిల్ కాలేకపోయారా ?

by Anji
Ad

అక్కినేని యువ జంట నాగచైతన్య, సమంత విడిపోవడం ఇరువురి ఫ్యాన్స్ ఇప్పటికీ జీవించుకోలేకపోతున్నారు. వీరి విడాకుల ప్రకటన వచ్చి ఏడాది గడిచినా ఇప్పటికీ చై_సామ్ డివర్స్ మీటర్ జనాల్లో హాట్ టాపిక్ గానే నడుస్తుంది. ఈష్యూ పై సినీ వర్గాల్లో ఎక్కడో చోట ఏదో ఒక రకమైన డిస్కషన్ నడుస్తూనే ఉంది. ఒకరంటే ఒకరు ఇష్టపడి ఏరి కోరి వివాహం చేసుకొని, మళ్ళీ విడాకులు ఎందుకు తీసుకున్నారనే ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Advertisement

ఈ జంట విడాకులు తీసుకోవడానికి ఇదే కారణం అంటూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటిదే తాజాగా మరో వార్త వైరల్ గా మారింది. సమంత విడాకులు తీసుకోవడానికి తన మాజీ అత్తగారు లక్ష్మీ కారణమంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. గతంలో లక్ష్మీ చేసిన తప్పే ఇప్పుడు సమంత కూడా చేసిందని, ఆ తప్పు కారణంగానే నాగార్జునకు లక్ష్మీ దూరం అయితే.. ఇప్పుడు అదే తప్పు చేసి నాగచైతన్యకు, సమంత దూరమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వరుస ప్లాప్ సినిమాలతో హిట్ కొట్టలేక బాధపడుతున్న నాగార్జునను లక్ష్మి ఓదార్చి, ఆయనకు నచ్చిన విధంగా నడుచుకుని ఉంటే నాగార్జునకు లక్ష్మీపై ప్రేమ అలాగే ఉండేదని, వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉండేవి కావని చెబుతున్నారు. అంతేకాదు ఇప్పుడు నాగచైతన్య పోజిషన్ కూడా అలాంటిదేనని, సినిమాలలో సరైన సక్సెస్ లేక మరోవైపు స్టార్ హీరోయిన్ భర్త అని అందరూ చెప్పుకునే స్థాయికి దిగజారిపోవడం, ఈ పరిస్థితుల్లో సమంత అర్థం చేసుకోకుండా రెచ్చిపోయి మాట్లాడడమే వీరి విడాకులకు కారణం అంటూ ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఏది ఏమైనా ఇప్పటికైనా ఓసారి ఆలోచించి వాళ్ళు మళ్ళీ కలిస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading