Home » బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే ఈ టీ తీసుకుంటే ఫలితం పక్కా..!

బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే ఈ టీ తీసుకుంటే ఫలితం పక్కా..!

by Anji
Ad

మారుతున్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, పనితీరు మారడం వెరసి.. ఇటీవల ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఆహారం తీసుకోకపోయినా బరువు పెరుగుతున్నారు. అయితే పెరిగే బరువును తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ఇక బరువు తగ్గించుకోవడానికి చాలా మంది డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకుంటున్నారు. అయితే సహజ పద్ధతుల ద్వారా కూడా బరువు తగ్గొచ్చు. అలాంటి వాటిలో బెల్లం టీ ఒకటి. బెల్లం టీ ని అలవాటు చేసుకోవడం వల్ల సహజంగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బెల్లంటి ద్వారా శరీరానికి ఎలాంటి పోషకాలు లభిస్తాయి? బెల్లం టీని ఎలా తయారు చేసుకోవాలి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

బెల్లం పోషకాలకు పెట్టింది పేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బెల్లంలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులోని కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, బీ కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి2 వంటివి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బెల్లం టీని క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. దీంతో పొట్టలో ఉన్న కొవ్వు కరిగిపోవడమే కాకుండా కొత్తగా కొవ్వు పేరుకుపోదు. పొట్ట చుట్టూ కొవ్వు రాకుండా ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా బెల్లంలోని చక్కెర కంటెంట్ జీవక్రియ రేటును పెంచుతుంది. ఐరన్ లోపం ఉన్నవారికి కూడా బెల్లం దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. రక్తహీనతకు చెక్ పెడుతుంది. ఇక బెల్లం లోని పొటాషియం ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది.


కండరాలను నిర్మించడానికి, జీవక్రియను పెంచడానికి పొటాషియం తోడ్పడుతుంది. అధిక బరువును ఇది కరిగిస్తుంది. బెల్లం టీని తయారీకి నీళ్లు, బెల్లం, టీపొడి, అల్లం, యాలకులు, దాల్చిన చెక్క, నల్ల మిరియాల పొడి కావాలి. మొదట స్టవ్ వెలిగించి గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకోవాలి. అనంతరం మూడు టేబుల్ స్పూన్లు టీ పొడి, ఒక టేబుల్ స్పూన్ అల్లం, ఒక అంగుళం యాలకులు, మూడు దాల్చిన చెక్క వేసి ఐదు నిమిషాలు మరగబెట్టాలి. తర్వాత మిరియాల పొడిని కలపాలి. టీపొడి, బెల్లం మిక్స్ చేయాలి. దీన్ని బాగా మరగనిచ్చి ఆరిపోయిన తర్వాత తాగాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Visitors Are Also Reading