బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ గురించి అందిరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆయన ప్రస్తుతం మలయాళి సినిమా కడువాలో నటించారు. పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్ జరిగిన కడువా ప్రెస్‌మీట్‌లో వివేక్ పాల్గొన్నారు.
Advertisement
ముఖ్యంగా వివేక్ రక్త చరిత్ర రోజులను గుర్తు చేసుకున్నారు. తనకు అవకాశం వస్తే తప్పకుండా పూర్తి స్థాయిప్రేమ కథా చిత్రంలో తాను నటించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. తెలుగు ప్రేక్షకులు సినిమాల పట్ల చూపించే ప్రేమ దేశంలో మరెక్కడా దొరకదు అని పేర్కొన్నారు. రక్త చరిత్ర విడుదల సమయంలో చోటు చేసుకున్న ఓ ఘటన తాను ఎప్పటికీ మర్చిపోను అనివెల్లడించారు. రక్తచరిత్రతో నేను దక్షిణాది చిత్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. పరిటాల రవి లాంటి పవర్ పుల్, అద్భుతమైన రోల్‌లో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.
Advertisement
ఇక రక్త చరిత్ర సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోని రియల్ ఫ్యాక్షనిజం తీవ్రత గురించి తెలుసుకున్నాను. ఆ సినిమా విడుదల అయినప్పుడు దానిని చూసేందుకు హైదరాబాద్‌లోని ఓ సినిమా థియేటర్‌కు వెళ్లాను. సినిమాలో సాధారణ స్కూటర్‌పై ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ సీన్ చూసి థియేటర్‌లో ప్రేక్షకులందరూ ఈలలు వేసి గోల చేశారు. ఆ క్షణం వాళ్లు చూపించిన ఉత్సాహం చూస్తే చూడముచ్చటగా అనిపించింది. ఆ ఘటన ఎప్పటికీ మరిచిపోను. సినిమా పట్ల తెలుగు వారికి ఎంత ప్రేమ ఉంటుందో అప్పుడు నాకు అర్థమైంది. దేశంలో మరెక్కడా కూడా ఇలా కనిపించదు అని వివేక్ వెల్లడించారు. బాలీవుడ్‌లో విభిన్న కథా చిత్రాలలో నటించిన వివేక్ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్తచరిత్రలో తెలుగులోకి ఎంట్రి ఇచ్చారు. ఈ సినిమా లో వివేక్ నటన అద్భుతమనే చెప్పాలి.
Also Read :
లెజెండరీ నటుడు నాజర్ నటనకు సెలవు.. కారణం అదేనా..?