Home » కె.విశ్వనాథ్ చివరి క్షణాల్లో తన పెద్ద కొడుకుని పిలిచి అది రాయమన్నారా..?

కె.విశ్వనాథ్ చివరి క్షణాల్లో తన పెద్ద కొడుకుని పిలిచి అది రాయమన్నారా..?

by Sravanthi
Ad

తెలుగు సినీ పరిశ్రమ ఒక లెజెండరీ డైరెక్టర్ ను కోల్పోయిందని చెప్పవచ్చు. ఆయన ఇండస్ట్రీకి చేసిన సేవలు మరువలేం. ఆయన రాసిన పాటలు, కథలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు.. అలాంటి కళాతపస్వి మరణం బాధాకరం. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రపంచమంతా ఒక్కసారిగా శోకశాంద్రంలో మునిగిపోయింది.. ప్రముఖులంతా నివాళులర్పించి అంతిమయాత్ర నిర్వహించారు. అలాంటి విశ్వనాధ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషి, శంకరాభరణం, స్వాతిముత్యం, సిరివెన్నెల వంటి అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Advertisement

ఎంతోమంది హీరో, హీరోయిన్లకు సినీ కెరియర్ ను అందించారని చెప్పవచ్చు. 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన విశ్వనాథ్ తను చనిపోయే చివరి క్షణాల్లో కూడా సినిమానే శాసిస్తూ తుది శ్వాస విడిచారట. చివరిగా ఒక పాట రాస్తూనే మృతి ఒడిలోకి జారుకున్నట్టు సమాచారం. అయితే విశ్వనాథ్ కు ఎంతో పేరు తీసుకువచ్చిన మూవీ శంకరాభరణం. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 2న థియేటర్లోకి వచ్చింది. అయితే అదే రోజు ఉదయం ఎంత ఉత్సాహంగా ఉన్న విశ్వనాథ్ ఆరోజు ఒక పాట రాయడానికి పూనుకున్నారట. చేతితో రాసేందుకు ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో ఆయన పెద్ద కుమారుడుని పిలిచి నోటితో చెబుతుంటే అక్షర రూపం ఇవ్వమని చెప్పారట.

Advertisement

అలా ఆ రోజంతా పాటను పూర్తి చేయడంపై మనసుపెట్టిన విశ్వనాథ్.. ఆ పాట నోటితో చెబుతూనే గాఢ నిద్రలోకి జారుకున్నారట. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆ విధంగా సినిమా కోసమే బతికిన మహనీయుడు.. చివరికి సినిమాలు తలచుకుంటూ తుది శ్వాస విడిచారని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి..

also read:టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్ర సృష్టించిన రోజే అఖిల్ ‘ఏజెంట్’ మూవీ..!

Visitors Are Also Reading