Home » టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్ర సృష్టించిన రోజే అఖిల్ ‘ఏజెంట్’ మూవీ..!

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్ర సృష్టించిన రోజే అఖిల్ ‘ఏజెంట్’ మూవీ..!

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ హీరోగా వరుస పరాజయాలలో ఉన్న అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కథానాయకుడిగా తొలి సక్సెస్ సాధించారు. 2021లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో సాప్ట్ రోల్ లో కనిపించిన అఖిల్.. ప్రస్తుతం ఏజెంట్ సినిమా కోసం పూర్తిగా ట్రాన్స్ ఫామ్ అయ్యాడు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ ఎప్పుడో ప్రకటించారు. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మూవీ మేకర్స్. 

Advertisement

ఏజెంట్ పేరుతో వస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. అఖిల్ ఏజెంట్ సినిమాని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురేందర్ 2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాని భారీ పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదల తేదీ ప్రోమోలో అఖిల్ ని నిన్ను ఎవరు పంపించారు అంటూ విలన్స్ అడగడంతో.. దానికి అఖిల్ ఒసామా బిన్ లాడెన్, గడాఫీ వంటి పేర్లు చెప్పడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరో ముఖ్యపాత్రలో నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఏజెంట్ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో భారీ ట్విస్ట్ ఉంటుందని సమాచారం. అఖిల్ క్యారెక్టర్ పై రివీల్ అయ్యే ఈ ట్విస్ట్ సినిమాకే హైలెట్ అని.. ఈ చిత్రం స్క్రీన్ ప్లై కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో అఖిల్ తన నరాలు బలంగా ఎలివేట్ అయ్యేవిధంగా కండలు పెంచి మరీ నటిస్తున్నాడు. 

Advertisement

Also Read :   అఖండ సినిమాలో కనిపించిన ఈ అందమైన అమ్మాయి ఎవరో తెలుసా..? బాలయ్య సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందంటే..?

ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్  చూసి అందరూ ఫిదా అవుతున్నారు.  ఏజెంట్ సినిమా కోసం అఖిల్  పడుతున్న కష్టం చూసి పలువురు మెచ్చుకుంటున్నారు. అఖిల్ సినిమాని వాస్తవానికి ఎప్పుడో విడుదల చేయాలనుకున్నారు కానీ కుదరకపోవడంతో  సమ్మర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. సమ్మర్ కానుకగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ చరిత్రను మార్చిన ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 28, 1977లో ఎన్టీఆర్ అడవి రాముడు చిత్రం అప్పట్లో  ఇండస్ట్రీ లో రికార్డుని నమోదు చేసింది. ఇదే రోజు 2006లో మహేష్ బాబు ‘పోకిరి’ చిత్రం కూడా సంచలనమే నమోదు చేసింది. ఇక ఏప్రిల్ 28, 2017న వచ్చిన బాహుబలి 2 కేవలం తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా రికార్డులను నమోదు చేసింది. అటువంటి మెమరబుల్ డేట్ లో అఖిల్ ఏజెంట్ మూవీ విడుదలవ్వడం పట్ల అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్  ‘ఏజెంట్’ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయనుందో వేచి చూడాలి మరి. 

Also Read :   షాకింగ్ న్యూస్…చైతూకు విడాకులు ఇచ్చినా అక్కినేని ఫ్యామిలీని విడిచిపెట్టని సమంత..!

Visitors Are Also Reading