Home » virataparvam real story:విరాటపర్వంలో ఓరుగల్లు బిడ్డ సరళ కన్నీటి గాథ..అసలు కథ తెలిస్తే కన్నీరు పెడతారు..?

virataparvam real story:విరాటపర్వంలో ఓరుగల్లు బిడ్డ సరళ కన్నీటి గాథ..అసలు కథ తెలిస్తే కన్నీరు పెడతారు..?

by Sravanthi
Ad

పాత ఓరుగల్లు ప్రస్తుత వరంగల్ నగరంగా పేరు పొందింది. కాకతీయులు ఏలినగడ్డ ఘన చరిత్రను తన మనసులో దాచుకుంది. రాణి రుద్రమ నుంచి మొదలు చాకలి ఐలమ్మ వరకు ఎందరో ఉద్యమకారులను అక్కున చేర్చుకుని వారి విజయగాథలను మనసు నిండా నింపుకుని కాకతీయ కళా తోరణానికి వన్నె తెచ్చిన నగరం ఓరుగల్లు.. ఆ నగరమే ఇప్పుడు విరాటపర్వం మూవీ కి ఆజ్యం పోసింది.. చిన్నతనంలోనే పేద ప్రజల పక్షాన పోరాడేందుకు పీపుల్స్ వార్ ఉద్యమంలోకి దిగిన సరళ నిజజీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు వేణు ఊడుగుల..

సరళ కుటుంబ నేపథ్యం :
ఉద్యమ ముద్దుబిడ్డ సరళ తల్లిదండ్రులు స్వరాజ్యం బిక్షమయ్య.. తండ్రి వామపక్ష భావాలు కలిగినటువంటి వ్యక్తి.. సిపిఐ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఎదిగారు. వీళ్ల కుటుంబం ఉమ్మడి వరంగల్ జిల్లా లోని భూపాలపల్లి లోని మోరంద పల్లిలో నివసించేవారు.. ఒక అక్క ఇద్దరు సోదరులు తర్వాత చివరి సంతానంగా సరళ జన్మించింది. చిన్న అమ్మాయి కాబట్టి ఇంట్లో అందరికి గారాబమే. ఆ సమయంలో వరంగల్ ప్రాంతమంతా వామపక్ష ఉద్యమాలతో రగిలి పోతూ ఉండేది. 1985 లో వీరి కుటుంబం పిల్లల చదువు కొరకు ఖమ్మం వెళ్ళింది. కటిక పేదరికం.. సరళ కేమో ఉద్యమంలోకి వెళ్లాలనే భావన.. పైకి ఎవరికైనా చెబితే అడ్డంకి చెబుతారని ఎవరికీ చెప్పేది కాదు. ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా అడవి బాట పట్టింది సరళ.

Advertisement

Advertisement

అప్పుడు పీపుల్స్ వార్ లో పనిచేస్తున్న శంకరన్న మంచి ఉద్యమ నేత. ఆయన్ని వెతుక్కుంటూ ఖమ్మం నుంచి నిజామాబాద్ అడవిలోకి వెళ్ళింది. ఈ సమయంలోనే అక్కడ పీపుల్స్ వార్ ఉద్యమకారులు సరళను పోలీస్ ఇన్ ఫార్మర్ అనుకొని హతమార్చారు. సరళ ఇంటిలో నుంచి అక్కడికి వెళ్ళాక చాలా రోజుల తర్వాత పీపుల్స్ వార్ విడుదల చేసిన ఒక లేఖ ద్వారా ఆమె చనిపోయిందని తెలియడంతో వారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.. దీన్ని ఆధారంగా చేసుకున్న వేణు ఉడుగుల సరళ నిజ జీవితాన్ని విరాట పర్వంగా తెరకెక్కించారు.

 

సరళ పాత్రలో నటించిన సాయి పల్లవి, రవన్న పాత్రలో నటించిన రానా మొదటిసారి పీపుల్స్ వార్ సినిమాలో ప్రేమకథని ఆడ్ చేసి సరికొత్త ఉద్యమ నేపథ్యాన్ని చూపించారు దర్శకుడు. ఈమధ్య సరళ కుటుంబ సభ్యులను కలవడానికి హనుమకొండ వెళ్లారు చిత్రయూనిట్. సాయి పల్లవిని చూసిన తర్వాత సరళ తల్లి గట్టిగా హత్తుకొని, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి, ఎక్కడికి వెళ్ళిపోయావు అనగానే సాయి పల్లవి ఎమోషనల్ అయిందట. దీంతో సరళ కుటుంబసభ్యులు సాయిపల్లవికి బొట్టు పెట్టి చీర కూడా పెట్టి పంపారని తెలుస్తోంది. ఏదిఏమైనా ఎవరికీ తెలియని సరళ జీవిత కథను సినిమాగా మలిచిన దర్శకుడు వేణు ఉడుగుల సినిమా తప్పకుండా సక్సెస్ కావాలని కోరుకుందాం.

also read;

Virataparvam movie review &rating : విరాటపర్వం సినిమా రివ్యూ…!

సినిమా షూటింగ్ లో ర‌వితేజ‌కు గాయాలు.. 10 కుట్లు.. అస‌లు ఎలా జ‌రిగిందంటే..?

 

Visitors Are Also Reading