విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై ఈ ఆసియా కప్ కు ముందు భారీ విమర్శలు అనేవి వచ్చాయి. అందుకు కారణం కోహ్లీ పరుగులు చేయలేక ఇబ్బందికి పడటం.. అలాగే ప్రతి మ్యాచ్ లో ఒక్కే విధంగా తన వికెట్ అనేది కోల్పోవడం వంటివి కోహ్లీపై విమర్శల దాడికి కారణమయ్యాయి. దాంతో కోహ్లీ దాదాపు నెలకు పైగా విశ్రాంతి అనేది తీసుకొని నేరుగా ఆసియా కప్ లోకి వచ్చాడు. ఇక ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ నుండే కోహ్లీ మళ్ళీ తన మార్క్ అనేది చూపిస్తున్నాడు.
Advertisement
మొదట పాకిస్థాన్ తో మ్యాచ్ లో 35 పరుగులు చేసిన కోహ్లీ ఆ తర్వాత హ్యాంగ్ కాంగ్ పైన 59 పరుగులు చేసాడు. ఇక ఈరోజు మళ్ళీ పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా 60 పరుగులు చేసి ఇండియాను ఆదుకున్నాడు అనే చెప్పాలి. అయితే ఈరోజు పాక్ పై చేసిన హాఫ్ సెంచరీతో విరాట్ ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసాడు.
Advertisement
అదేంటంటే.. అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో అత్యధికసార్లు 50+ రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లీ ఉన్నాడు. అయితే ఇన్ని రోజులు 31 సార్లు ఈ ఫిట్ అనేది సాధించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. కానీ హ్యాంగ్ కాంగ్ మ్యాచ్ లో దానిని సమానం చేసిన కోహ్లీ ఈరోజు పాక్ పై మ్యాచ్ లో అర్ధ శతకం బాది 32 సార్లు ఈ ఫిట్ అందుకున్న ప్లేయర్ గా నిలిచాడు.
ఇవి కూడా చదవండి :