టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ లో స్టార్ బ్యాట్స్‌మెన్ గా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. అండర్ 19 వరల్డ్ కప్ టీమ్ ఇండియాకు తీసుకువచ్చిన తర్వాత… సీనియర్ టీం ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.దీంతో వచ్చి రాగానే టీమిండియా కెప్టెన్ కూడా అయిపోయాడు కోహ్లీ.ఈ నేపథ్యంలోనే టీమిండియా కు తన కెప్టెన్సీలో చాలా విజయాలను అందించాడు విరాట్ కోహ్లీ.
Advertisement
అయితే కొన్ని అనువార్య కారణాలవల్ల తన కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్లేయర్‌గా జట్టులో కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉండగా తాజాగా… తన అభిమానులకు విరాట్ కోహ్లీ అదిరిపోయే శుభవార్త అందించాడు.టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ అయిన విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నట్లు సమాచారం అందుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ రెండోసారి తల్లి కాబోతుందన్నమాట.అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వబోతుందని త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుందని బాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
Advertisement
దీంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం ముంబైలోని ఓ గైనకాలజీ క్లినిక్ కు విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ వెళ్లారని… జాతీయ మీడియా సంస్థ ఆయన హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేస్తామని చెప్పి ఫోటోలు తీయవద్దని ఆ సందర్భంగా విరాట్ కోహ్లీ అభ్యర్థించాడంట. ఈ విషయాన్ని కూడా హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది. మరి దీనిపై ఎప్పుడూ అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి. కాగా ఇప్పటికే విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మకు కూతురు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- Baber Azam : తెలంగాణ బీజేపి లీడర్‌గా బాబర్ ఆజాం ?
- అక్షర్ పటేల్ సంచలన పోస్ట్.. నాకు అన్యాయం చేశారని ఫైర్ ?
- Sneha : భర్తకు తెలియకుండా ఆ నిర్మాతతో స్నేహ రిలేషన్ !!