ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఎంతో కొంత పరుగులు చేసిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ కేవలం 216 పరుగులు మాత్రమే చేసాడు. అది అలా ఉంచితే.. ఇప్పటికే ఈ సీజన్ లో మూడు సార్లు గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ నవ్వే నవ్వు అభిమానులకు బాధను, కోపాన్ని ఒక్కేసారి తెస్తుంది. దాంతో విరాట్ పై విమర్శలు భారీ ఎత్తున వస్తున్నాయి.
Advertisement
అయితే తాజాగా ఈ గోల్డెన్ డక్ నవ్వు పై కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేసాడు. నా కెరియర్ లో నేను ఎప్పుడు వరుసగా రెండు ఇన్నింగ్స్ లలో గోల్డెన్ డక్ కాలేదు. అందుకే అలా నవ్వాను. అయితే నేను ఇలా ఆడుతున్నప్పుడు.. నాకు మద్దతుగా నిలిచేది ఎవరు… విమర్శించేది ఎవరు అనేది నాకు బాగా తెలుస్తుంది. ప్రతి దానిని నేను గమనిస్తున్నాను అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
Advertisement
ఇక ఈ ఐపీఎల్ లో లక్నో సూపర్ జెంట్స్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లలో కోహ్లీ వరుసగా గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ సన్ రైజర్స్ తో ఆడిన రెండో మ్యాచ్ లోనే కోహ్లీ గోల్డెన్ డక్ అయ్యాడు. అయితే ఐపీఎల్ లో గత 14 సీజన్ లు కలిపి మొత్తం 3 సార్లు గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరిన కోహ్లీ ఇప్పుడు ఈ ఒక్క సీజన్ లోనే మూడు సార్లు గోల్డెన్ డక్ అవ్వడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
నయన్ తో సినిమాల్లోకి ధోని ఎంట్రీ…?
తిరిగి వస్తున్న డివిలియర్స్… క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!