Home » అప్పుడు సైలెంట్ గా ఉండాలి అంటున్న విజయ్..!

అప్పుడు సైలెంట్ గా ఉండాలి అంటున్న విజయ్..!

by Azhar
Ad
టాలీవుడ్ యంగ్ గిరొ విజయ్ దేవరకొండ ఇప్పుడు సూపర్ స్పీడ్ లో దూసుకపోతున్నాడు. పెళ్లి చూపులు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్.. ఆ తర్వాత చేసిన అర్జున్ రెడ్డి సినిమా అనేది చాలా క్రేజ్ అనేది అతనికి తీసుకువచ్చింది. ఇక ఈ సినిమాతో విజయ్ ఎంత క్రేజ్ అయితే సంపాదించుకున్నాడో.. అప్పుడు తన మాటలతో కూడా అంతే క్రేజ్ అనేది తెచుకున్నాడు. ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడిగిన సంధానం ఇచ్చేవాడు.
మరి ముఖ్యంగా అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ స్పీచ్ అనేది తెగ వైరల్ అయ్యింది. అయితే అలా ఎవరికీ భయపడకుండా మాట్లాడే విజయ్ దేవరకొండ ఇప్పుడు కొన్ని సందర్భాలలో సైలెంట్ గా ఉండాలి అని కామెంట్స్ చేస్తూ అందర్నీ షాక్ కు గురి చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం విజయ్.. తాను చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా లైగర్ యొక్క ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
అందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. నా కెరియర్ మొదట్లో ఎవరు ఏం అడిగిన.. ఎలాంటి ప్రశ్న అడిగిన సమాధానం ఇచ్చే వాడిని. కానీ అలా చేయడం తప్పు అనేది ఇప్పుడు తెలుస్తుంది. అయితే మనల్ని ఓ ప్రశ్న అడిగేవారికి మన మీద ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది. కాబట్టి వారికీ మనం ఏం చెప్పిన తప్పుగానే అర్ధం అవుతుంది. అందుకే కొన్నిసార్ల సైలెంట్ గా ఉండటం చాలా మంచిది అని విజయ్ చెప్పాడు.

Advertisement

Visitors Are Also Reading