Home » ధోని జట్టులో ఉండాలి అంటే బ్యాటింగ్ కంటే అదే ముఖ్యమట..!

ధోని జట్టులో ఉండాలి అంటే బ్యాటింగ్ కంటే అదే ముఖ్యమట..!

by Azhar
Ad

భారత జట్టులోకి ధోని వచ్చిన తర్వాత మూడేళ్లకే కెప్టెన్సీ అనేది వచ్చింది. 2007 లో జరిగిన మొదటి టీ20 ప్రపంచ కప్ లో కెప్టెన్ గా చేసి జట్టుకు టైటిల్ అందించాడు. ఇక ఆ తర్వాత పూర్తి స్థాయి కెప్టెన్ గా ధోని పగ్గాలు అందుకున్నాడు. ఇక అప్పటి నుండి జట్టులో మార్పులు అనేవి ఎక్కువగా వచ్చాయి. సీనియర్ ఆటగాళ్లు అందరూ ఒక్కొక్కరిగా జట్టుకు దూరం కావడం.. జూనియర్ ఆటగాళ్లు ఎక్కువగా రావడం అనేది జరిగింది.

Advertisement

అయితే ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో తన జట్టులో ఉండాలి అంటే బ్యాటింగ్, బౌలింగ్ కంటే ఓ రెండు చాలా ముఖ్యం అని టీం ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ అన్నారు. అయితే ఆర్ శ్రీధర్ 2014 నుండి 2021 ఆఖర్లో జరిగిన ప్రపంచ కప్ వరకు కూడా జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా ఉన్నాడు. అయితే ఆయన తాజాగా మాట్లాడుతూ… ధోని జట్టులో ఉండాలి అంటే ఫీల్డింగ్ ఆలాగే వికెట్స్ మధ్య పరిగెత్తడం చాలా ముఖ్యం అని చెప్పాడు.

Advertisement

ధోని తన జట్టులో ఉన్న ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా గమనించేవాడు అని.. ఈ రెండిట్లో సరిగ్గా లేకపోతే అతను ఎంత పెద్ద ఆటగాడు అయిన సరే జట్టు నుండి తప్పించేవాడు అని పేర్కొన్నాడు. ధోని ప్రారంభించిన ఈ విధానాన్ని తర్వాత వచ్చిన కెప్టెన్ కోహ్లీ కూడా ఫాలో అయ్యాడు అని ఆర్ శ్రీధర్ అన్నాడు. కోహ్లీ అయితే ఆటగాళ్ల ఫిట్నెస్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ చూపించేవాడు అని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

కామన్వెల్త్ లో మెడల్స్ సాధించిన క్రికెటర్ల భార్యలు వీళ్ళే..!

టీ20 జట్టులోకి తీసుకోకపోవడంపై ధావన్ కామెంట్స్..!

Visitors Are Also Reading