టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో విజయ్ దేవరకొండ ఒకరు. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఏదైనా ఫోటో షేర్ చేస్తే.. దాని కింద కామెంట్లు మొత్తం ఆయన పెళ్లి గురించిన చర్చలే జరుగుతాయి. దానికి తగినట్లుగానే విజయ్ దేవరకొండ , నటి రష్మిక ప్రేమలో ఉన్నారని.. చాలా కాలం నుంచి వీరిద్దరూ రహస్యంగా ఈ మేటర్ ని ఉంచుతున్నారు అంటూ చాలా రుమార్స్ చేస్తున్నాయి.
Advertisement
Advertisement
అంతేకాకుండా ఒక సందర్భంలో వీరిద్దరూ ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్న ఫోటోలను వేరువేరుగా పోస్ట్ చేయడం , బ్యాగ్రౌండ్ ఒకటే ఉండడంతో వాటిని చూసిన అభిమానులు విజయ్‌ను అన్నను చేసి..రష్మికను వదినమ్మను చేశారు. వీరిద్దరూ కలిసి మంచి సినిమాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక కొద్ది రోజుల నుంచి అయితే విజయ్ కి రష్మిక కి ఏకంగా ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్ నే చేసేస్తున్నారు. తాజాగా ఈ విషయం గురించి విజయ్ దేవరకొండ స్పందించారు. మీడియా వారు ప్రతి రెండు సంవత్సరాలకు ఓ సారి నాకు పెళ్లి చేసేస్తున్నారు. ఈ సారి పెళ్లి చేసేటప్పుడు నాకు కూడా చెప్పండి. చాలా మంది నా పెళ్లి కోసం ఎదురు చూస్తున్నట్లు ఉన్నారు. అందుకే ఈ ఫిబ్రవరిలో నాకు ఎంగేజ్‌మెంట్ చేస్తున్నారు. చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!