ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు బాగా వినిపిస్తుంది. తనదైన శైలిలో సినీ, రాజకీయ ప్రముఖుల జ్యోతిష్యాలు చెబుతూ.. వేణు స్వామి బాగా పాపులర్ అయ్యారు. తాజాగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో దోషం ఉందని చెప్పి సంచలనం సృష్టించారు. ఎన్టీఆర్ జాతకం గురించి వేణు స్వామి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. గతంలో వేణు స్వామి ఎన్టీఆర్ తల్లి శాలిని తిరుమలలో కలిశారట. అక్కడ ఎన్టీఆర్ జాతకం గురించి తల్లి శాలినితో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఆ సమయంలో వేణు స్వామి చెప్పిన మాటలకు ఆమె ఆశ్చర్యపోయారట. ఎన్టీఆర్ పుట్టుక విషయంలో ఒక పెద్ద సమస్య ఉందని వేణు స్వామి తల్లి శాలినీకి వివరించారట.
Advertisement
అప్పటికే ఎన్టీఆర్ కు ఉన్న దోషం తెలిసిన తల్లి శాలిని అంత కరెక్ట్ గా కొడుకు జాతకం గురించి ఎలా చెబుతున్నారని ఆశ్చర్యపోయారట. ఆ సమస్య ఏంటో నాకు తెలుసు అని ఎన్టీఆర్ కు ఉన్న పుట్టుక దోషం గురించి వేణు స్వామి క్లియర్ గా చెప్పారట. ఎన్టీఆర్ కు ఉన్న దోషం గురించి పెద్ద ఎన్టీఆర్ తో పాటు శాలనీకి మాత్రమే తెలుసు అని, మూడో వ్యక్తికి ఎవరికి తెలియదు అని అలాంటిది ఈ విషయం వేణు స్వామికి ఎలా తెలుసు అని ఎన్టీఆర్ తల్లి శాలిని ప్రశ్నించిందట. నాకు అన్ని విషయాలు తెలుసు అంటూ వేణు స్వామి సమాధానం ఇచ్చారట. అయితే ఆ సమస్య ఏంటి అనేది మాత్రం బయటికి చెప్పలేదు. జూనియర్ ఎన్టీఆర్ ది మఖా నక్షత్రం అని, జయలలిత ది కూడా అదే నక్షత్రం అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.
Advertisement
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉందని, కచ్చితంగా 2030 వరకు ఆయన్ను రాజకీయాల్లోకి రానివ్వకుండా వాళ్ళ అమ్మగారు అడ్డుపడుతున్నారని వేణు స్వామి పేర్కొన్నారు. తాత గారికి రాజయోగం ఎలా పట్టిందో, మనవాడు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా అలాగే రాజయోగం పడుతుంది అని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ జాతకంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే యోగ్యం ఉందని, కానీ ఆయనకు దోషం ఉందని వేణు స్వామి తెలిపారు. అయితే ఆ దోషం ఏంటి అనేది చెప్పకపోవడంతో నందమూరి అభిమానులు భయపడుతున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!