విక్టరీ వెంకటేష్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబోలో రాబోతోన్న మూవీ సైంధవ్ . ఈ నెల 13వ తేదీన సంక్రాంతి కానుకగా సైంధవ్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజయిన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. తండ్రీ కూతురు సెంటిమెంట్ తో శైలేష్ కొలను మార్క్ కథతో తెరకెక్కుతోన్న ఈ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మెగా స్టార్ చెప్పినట్లుగానే బ్లాక్ బస్టర్ అవుతుందా ? ఇంతకీ వెంకీ , చిరు మధ్య ఏం జరిగింది.
Advertisement
ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీలు లేని హీరో ఎవరూ అంటే విక్టరీ వెంకటేష్ పేరు ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే ఏ హీరో జానర్ ఏదయినా బాక్స్ ఆఫీస్ లో దుమ్మురేగాల్సిందే. ఇక.. సెంటిమెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వెంకటేష్ ఒకానొక టైంలో చిరు నటించిన డాడి సినిమాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిరు , వెంకీ ల మధ్య ఉన్న బాండింగ్ గురించి అందరికి తెలిసిందే. చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీ తో కమ్ బ్యాక్ అవకుండా ఉంటె .. ఈపాటికి ఏ హిమాలయాల్లోనో ఉండేవాడినని వెంకీ 75 ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడటంతో చిరు అంటే వెంకీకి ఎంత అభిమానమో యిట్టె అర్ధం అవుతోంది. చిరంజీవిపై ఎప్పుడూ విమర్శలు చేయని వెంకటేష్ డాడీ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడుమాత్రం విమర్శలు చేశారట. చిరంజీవి తను నటించిన డాడీ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ ఆనతి సంగతులను చెప్పడం జరిగింది.
నేను నటించిన డాడీ సినిమా గురించి వెంకీ ఊహించని కామెంట్ చేశాడని.. ఆ సినిమా అబోవ్ యావరేజ్ గా ఆడిందని చిరంజీవి తెలిపారు. ఆ సినిమాలో నేను బాగా చేయలేదని వెంకీ చెప్పాడని నేను నటించాను కాబట్టి డాడీ సోసోగా ఆడిందని అదే సినిమా తను చేసి ఉంటే సూపర్ డూపర్ హిట్ అయ్యేదని ఈ విషయాన్నీ వెంకీ ఫోన్ చేసి మరీ చెప్పాడని చిరంజీవి చెప్పుకొచ్చారు . తండ్రీ కూతురు సెంటిమెంట్ ను తాను బాగా చేస్తాననే కాన్ఫిడెన్స్ తో వెంకటేష్ ఆ మాట చెప్పాడని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. సైంధవ్ సినిమా కూడా తండ్రీ కూతురు కథతో తెరకెక్కుతున్న నేపథ్యంలో చిరంజీవి చేసిన కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వెంకీ చెప్పినట్టు చూస్తే సైంధవ్ హిట్ అంటూ మెగాస్టార్ పరోక్షంగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!