వెంకటేష్ మహా ఈ పేరు చెబితే ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు…. కానీ కేరాఫ్ కంచరపాలెం సినిమా దర్శకుడు అంటే టక్కున గుర్తుకు వస్తుంది. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో వెంకటేష్ మహా చాలామందికి సుపరిచితుడు అయ్యాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ALSO READ :Chanakya Niti : లక్ష్మీదేవి ఎక్కువగా అక్కడే ఉంటుందా ? వారికి డబ్బు లోటు ఉండదు
Advertisement
100 కోట్లు 1000 కోట్లు ఇలా వసూళ్లు రాబడుతున్న సినిమాలు అన్నీ నా దృష్టిలో పాప్ కార్న్ సినిమాలు…వాటిని పాప్ కార్న్ తింటూ చూడొచ్చు, మధ్యలో సీన్ మిస్ అయినా పర్లేదు అన్నట్టుగా ఉంటుందని అన్నారు. ఓటీటీ లో అయినా వాటిని చూడవచ్చు అని చెప్పారు. కానీ మేము తీసేవి ఓటిటి సినిమాలు కాదని ఖచ్చితమైన థియేటర్ సినిమాలు అని చెప్పారు.
Advertisement
ఒక సినిమా పేరు చెప్పను కానీ వివరిస్తాను….. ప్రపంచంలో ఒక తల్లి నువ్వు గొప్పోడివి ఆవ్వాలి రా అంటుంది. బాగా సంపాదించి నలుగురికి ఉపయోగపడాలని దాని అర్థం. కానీ తల్లి అంత కావాలి అని అంటుంది. హీరో వెళ్లి ఆ వస్తువును తవ్వి తవ్వినవారిని ఉద్ధరిస్తాడు…. ఒక పాట వస్తుంది. వాడు మొత్తం బంగారాన్ని తీసుకెళ్లి ఎక్కడో పడేస్తాడు అని అన్నారు. ఆ తల్లి నిజంగా ఉండి ఉంటే నాకు కలవాలని ఉంది. వాడంత పిచ్చోడు ఎవడైనా ఉంటాడా..? ఎంత నీచ్ కమీన్ కుత్తే కాకపోతే వాడు బంగారాన్ని ఎక్కడో పారదొబ్బుతాడు.
అలాంటి కుత్తే అవ్వమని తల్లి అడిగితే… అలాంటి కథలు సినిమా తీస్తే మనం చప్పట్లు కొట్టి చూస్తున్నాం అంటూ ఫైర్ అయ్యాడు. ఇక వెంకటేష్ మహా చెప్పింది మొత్తం కేజిఎఫ్ సినిమా అని నెటిజన్ లు క్లియర్ గా అర్థం చేసుకున్నారు. దాంతో కేజీఎఫ్ అభిమానులు వెంకటేష్ మహాపై ఫైర్ అవుతున్నారు. అసలు నువ్వు ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. కేజీఎఫ్ ఇండియా వ్యాప్తంగా విజయం సాధించిందని…. సినిమాను సినిమాలానే చూడాలని సూచిస్తున్నారు.
ALSO READ :ఎమ్మెల్సీ కవిత పై శ్రీరెడ్డి సెటైర్ లు..తెలంగాణా జోలికి రావొద్దంటూ ఫ్యాన్స్ వార్నింగ్..!