వాస్తు శాస్త్రం కొన్ని నియమ నిబంధనలతో చెప్పబడింది. వీటిని పాటిస్తే జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు లేకుండా ముందుకు సాగుతుంది. వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటె.. అవి మీ జీవితంపై గొప్ప సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. వాస్తు ప్రకారం మనం ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకుంటే.. మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంట్లో మనీ ప్లాంట్‌ని పెట్టుకోవడం గురించి కూడా వాస్తు శాస్త్రం వివరంగా చెప్పింది.
Advertisement
ఇంట్లో మనీ ప్లాంట్ ను పెట్టడం వలన లక్ష్మి దేవి సంతోషిస్తుంది అని హిందూ ప్రజలు విశ్వసిస్తారు. మనీ ప్లాంట్ ఇంట్లో ఆనందాన్ని, శ్రేయస్సుని తీసుకొస్తుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఆ ఇంట్లో దరిద్రం కూడా రావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ను ఈశాన్య దిశలో ఎప్పుడూ ఉంచకూడదు. ఈ దిశా బృహస్పూతిని సూచిస్తుంది. ఈయన శుక్రుడికి శత్రువు. శుక్రుడు విలాస కారకుడు. కాబట్టి ఈ దిశలో మనీ ప్లాంట్ ను పెట్టడం వలన ప్రతికూల ఫలితాలు వస్తాయి.
Advertisement
వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ను ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఈ దిశ శుక్ర గ్రహం చే ప్రాతినిధ్యం వహించబడుతుంది. ఈ దిశకు గణేశుడు దేవుడు. కాబట్టి ఈ దిశలో మనీ ప్లాంటు ను ఉంచడం శ్రేయస్కరం. ఇంటికి ఆనందాలను తీసుకు వస్తుంది. మనీ ప్లాంట్ పెరగడం ప్రారంభించాక నేలని తాకకుండా చూసుకోవాలి. అలాగే, ఈ ప్లాంట్ ను ఎప్పటికీ ఎండిపోకుండా చూసుకోవాలి.
ఈ 5 చిట్కాలతో మోకాళ్ళ నొప్పుల బాధ నుంచి సులభంగా బయటపడచ్చు..!
Rainy Season: వర్షాకాలంలో అధికంగా కామెర్ల వ్యాధి.. అరటిపండు అంత ప్రమాదమా?
Yawning : అదేపనిగా ఆవలింతలు రావడం అనారోగ్యానికి సంకేతమా..! నిపుణులు ఏమంటున్నారంటే..?