Home » తండ్రి కాబోతున్న వరుణ్.. స్పెషల్ విషెస్ చెప్పిన సమంత..!

తండ్రి కాబోతున్న వరుణ్.. స్పెషల్ విషెస్ చెప్పిన సమంత..!

by Anji
Ad

వరుణ్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది జాన్వీ కపూర్, వరుణ్ జంటగా నటించిన బవాల్‌ చిత్రంతో  సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నారు. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ యంగ్ హీరో తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

Advertisement

Advertisement

వరుణ్ ధావన్ త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. తన వైఫ్ బేబీ బంప్ పై ముద్దు పెడుతున్న ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మేము పేరెంట్స్ కాబోతున్నాము.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు మా పై ఉండాలి అంటూ రాసుకొచ్చారు. వరుణ్ పెట్టిన ఈ పోస్ట్ నిమిషాల్లో లక్షల లైక్స్, వేల కామెంట్స్ తో ఫుల్ వైరలవుతుంది. అభిమానుల నుంచి సినీ సెలెబ్రెటీల వరకు వరుణ్-నటాషాలకి  కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. కరణ్ జోహార్, అలియా భట్, సమంతా, కియారా అద్వానీ, పరిణీతి చోప్రా, కృతి సనన్, రాశి ఖన్నా, అర్జున్ కపూర్, వాణి కపూర్, నుపుర్ సనన్ ఈ జంటకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఇక సమంత “ఓ మై గాడ్” బెస్ట్ న్యూస్ అంటూ కామెంట్ పెట్టింది.

Also Read :  హీరో అవ్వాలని వచ్చి.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు..!

Visitors Are Also Reading