Home » Varshini Sounderajan : పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ వర్షిణి ?

Varshini Sounderajan : పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ వర్షిణి ?

by Bunty
Ad

జబర్దస్త్ యాంకర్ వర్షిని గురించి ప్రతి ఒక్కరికి పరిచయమే. జబర్దస్త్ షో తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో షోలలో అవకాశాలను అందుకుంది. యాంకర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందు మోడలింగ్ చేసేది. అంతేకాకుండా సినిమాలలో కూడా నటించేది. వర్షిని తన అంద చందాలతో ఎంతోమంది కుర్రాళ్ల మనసులను దోచుకుంది. తన అందాలను ఆరబోస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులను ఫిదా చేస్తుంది.

Varshini Sounderajan Getting Marriage

Varshini Sounderajan Getting Marriage

కొన్ని రోజుల క్రితం టీవీ ఛానల్లో విపరీతంగా కనిపించిన వర్షిని ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించడం లేదు. ఇక యాంకర్ వర్షిని పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో వార్తలు వచ్చినప్పటికీ తాను ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. హైపర్ ఆది, వర్షిని ప్రేమలో ఉన్నారని ఎన్నో పుకార్లు వచ్చినప్పటికీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇక తాజాగా ఈ మధ్యకాలంలో యాంకర్ వర్షిని తన బావని వివాహం చేసుకోబోతుందని వారిద్దరూ చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement

Anchor varshini

Anchor varshini

ఇక వివాహ అనంతరం వర్షిని సినిమాలలో నటించాలని ఆసక్తితో ఉందట. అంతే కాకుండా పలు షోలలో హోస్ట్ గా వ్యవహరించాలని ప్లాన్ వేసుకుందట. ఇక తాను వివాహం చేసుకోబోతుందనే వార్తలు వచ్చినప్పటికీ వరుడు వివరాలేవీ బయటకు రాలేవు. తన పేరేంటి, ఏం చేస్తాడు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు మాత్రం తెలియరాలేదు. ఈ వార్తలపై వర్షిని క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading