ప్రముఖ సీనియర్ నటుడు నాజర్ త్వరలోనే తాను నటనకు వీడ్కోలు పలకనున్నట్టు తన సినీ సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. సౌత్ ఇండియా సినీ అగ్ర శ్రేణి నటుల్లో నాజర్ ఒకరు. తన కెరీర్ లో ఎన్నో గొప్ప సినిమాల్లో నాజర్ అనేక విభిన్న పాత్రలను పోషించారు. ఆయన ఎన్నో సినిమాలకు ఉత్తమ నటుడిగా పలు అవార్డులు అందుకున్నారు.
Advertisement
సినిమాల నుంచి త్వరలోనే రిటైర్మెంట్ తీసుకుంటానని నాజర్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నాజర్ కంటే పెద్ద వాళ్లు కూడా ఇంకా యాక్టివ్ గా నటిస్తుంటే నాజర్‌కు మాత్రం ఏమైంది..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నాజర్ రోజుకు లక్ష నుంచి రెండు లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అసలు నాజర్ సినిమాల నుండి తప్పుకోవడానికి కారణమేదైనా ఉందా..? సినిమాలపై ఆసక్తి పోయిందా..? చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా నాజర్ ఎక్కువగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. ఆయన గుండె సంబంధిత వ్యాధితో కొన్నాళ్ల పాటు బాధపడ్డారు. ఇక అప్పటి నుంచి ఆయన సినిమాలు కూడా తగ్గించారు.
Advertisement
ఈ మధ్య ఓ సినిమా సెట్స్‌లో చిరంజీవిని కలిసిన నాజర్ చిరుతో ఇలా అన్నారట. సినిమా పరిశ్రమలో తన నటనకు సంబంధించి ఇదే చివరి దశ అని స్పష్టం చేశారు. నాకు తెలిసినంత వరకు నేను చివరి దశలో ఉన్నాను. సినిమాపై ఆసక్తి ఉంది. కానీ వయసు కూడా సహకరించాలి కదా. భవిష్యత్‌లో ఒకవేళ నటించినా చాలా సెలెక్టివ్ గా మాత్రమే చేస్తానని నాజర్ రెండేండ్ల కిత్రమే ఓ ప్రముఖ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
Also Read :
రామ్ పోతినేని పెళ్లికి ముహుర్తం ఖారారు.. పెళ్లి కూతురు ఎవరంటే..?