టాలీవుడ్ లో నటుడిగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఎస్వి కృష్ణారెడ్డి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం ఎస్వీ కృష్ణారెడ్డి గ్యాప్ లేకుండా సినిమాలు చేసేవారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎస్ వి కృష్ణారెడ్డి మద్రాస్ కు వెళ్లారు. అక్కడ సినిమాల్లో నటుడిగా చిన్నచిన్న అవకాశాలను అందుకున్నారు.
Advertisement
ఇక మొదటిసారిగా అచ్చిరెడ్డి నిర్మాణంలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత అదే బ్యానర్లో ఎస్వి కృష్ణారెడ్డి మాయలోడు సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో సూపర్ స్టార్ కృష్ణకు ఓ సన్నివేశాన్ని చెప్పారు. ఆ సీన్ బాగా నచ్చడంతో కృష్ణ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Advertisement
ఆ తర్వాత 1994 సంవత్సరంలో కృష్ణ హీరోగా సౌందర్య హీరోయిన్ గా నెంబర్ వన్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను కూడా మనీషా ఆర్ట్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై అచ్చిరెడ్డి నిర్మించారు. ఇక ఈ చిత్రంలోని పాటలకు కూడా ఎస్వి కృష్ణారెడ్డి స్వరాలు సమకూర్చారు. సినిమాలోని ఐదు పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే ఈ సినిమా విడుదల సమయంలో కొన్ని విమర్శలు మొదలయ్యాయి.
ఆ సమయంలో కృష్ణ సినిమాలు చేయడం తగ్గించారు. దాంతో విమర్శకులు సినిమాలు చేయని కృష్ణ నంబర్ వన్ ఏంటి అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే దీనికి ఎస్వీ కృష్ణారెడ్డి క్లారిటీ ఇస్తూ… సినిమాలో తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా హీరో తన కుటుంబ బాధ్యతలను భుజానమోస్తాడు. కుటుంబ బాధ్యతలను తమ భుజాలపై మోసే ప్రతి ఒక్కరు కూడా నెంబర్ వన్ అంటూ సమాధానం ఇచ్చారు. దాంతో ఆ విమర్శలకు చెక్ పడింది.
ALSO READ: బాలయ్య భైరవద్వీపం సినిమాతో చిరంజీవి, రజినీకాంత్ లకు ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా..?