జీవితం అన్న తరవాత కష్టసుఖాలు రెండూ ఉంటాయి. కష్టాలకు ఓర్చుకుని నిలబడితే ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ కాళ్ల దగ్గరకు రాకుండా పోదు. దానికి ఉదాహరణే తమిళ స్టార్ హీరో ధనుష్ ఫ్యామిలీ. ధనుష్ తండ్రి కస్తూరి రాజా దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. కానీ ఒకప్పుడు కస్తూరి రాజా ఒక మిల్ లో పనిచేసేవారు. కస్తూరి రాజాకు దనుష్ , సెల్వరాఘవన్ అనే ఇద్దరు కొడుకులతో పాటూ మరో ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ధనుష్ చిన్న వయసులో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదురుకున్నారు.
Advertisement
మిల్ లో పని చేస్తున్న సమయంలో కస్తూరి రాజా కుటుంబంతో కలిసి ఒక చిన్న ఇంటిలో ఉండేవారట. అంతే కాకుండా తినడానికి కూడా రెండు పూటలా భోజనం దొరకని రోజులను అనుభవించారట. ధనుష్ కు ఐదేళ్లు వచ్చేవరకు అలాంటి పరిస్థితులే ఉండేవట. అయితే కస్తూరి రాజా మిల్ లో పనిచేస్తున్న సమయంలోనే కథలు రాసేవారు. ఆ కథలను రూ.50 చొప్పున అమ్ముకునే వారు. ఇక ఆ కథలను కస్తూరి రాజా వద్ద కొనుకున్న వాళ్లు ఎక్కువ మొత్తానికి దర్శకులకు అమ్మి డబ్బులు సంపాదించుకున్నారు.
Advertisement
అలాంటి సమయంలో కస్తూరి రాజాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. దాంతో ఉద్యోగం వదిలి వెంటనే వెళ్లిపోయాడు. కానీ దర్శకుడిగా ఎదగటానికి ఏకంగా 15 ఏళ్ల సమయం పట్టింది. అలా ఎన్నో కష్టాలు పడినప్పటికీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా తన పెద్దకుమారుడు సెల్వరాఘవన్ కు కూడా దర్శకుడిగా తీర్చిదిద్దాడు. సెల్వా రాఘవన్ సెవన్ బై జి బృంధావన్ కలానీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగులో తెరకెక్కించారు.
ఇక ధనుష్ ఇంటర్ లో ఫెయిల్ అవ్వడంతో నటన నేర్పించి తన సినిమాతోనే హీరోగా పరిచయం చేశాడు. కానీ మొదట సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తరవాత సెల్వ రాఘవన్ ధనుష్ తో కాదన్ కొండియన్ అనే తమిళ సినిమాను రీమేక్ చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తరవాత ధనుష్ వరుస ఆఫర్ లు అందుకున్నాడు. ఏకంగా రజినీకాంత్ ఇంటికి అల్లుడయ్యాడు. కానీ ఇటీవలే ధనుష్ తన భార్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.