టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఎవరని అడిగితే ఎలాంటి డౌట్ లేకుండా చెప్పే పేరు బ్రహ్మానందం. వందల చిత్రాలలో నటించి బ్రహ్మానందం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అంతే కాకుండా పద్మశ్రీ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. ఇక ప్రస్తుతం బ్రహ్మానందం వయసు రిత్యా సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తూ తన మనవడితో కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు.
Advertisement
అంతే కాకుండా పెయింటింగ్ వేస్తూ కూడా తనలోని మరో టాలెంట్ ను బయటపెడుతున్నారు. ఇక సినిమాలకు దూరంగా ఉన్నా మీమ్స్ ద్వారా బ్రహ్మానందం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటారు. ఇదిలా ఉండగా బ్రహ్మానందం జీవితంలో ఓ మర్చిపోలేని సంఘటన ఉంది. ఆయన స్టేజిపై కామెడి చేస్తున్నా అందరూ చూస్తూ ఉండిపోయారు తప్ప ఒక్కరు కూడా నవ్వలేదట. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం…బ్రహ్మానందం ఆంధ్రప్రదేశ్ లోని సత్తెనపల్లి జిల్లా ముప్పాడ గ్రామంలో జన్మించారు.
Advertisement
బ్రహ్మానందం కుటుంబం పేదరికంలో ఉండేవారు. అంతే కాకుండా బ్రహ్మి కుటుంబంలో పోస్ట్ గ్రాడ్యూయేషన్ వరకూ చదువుకుంది ఆయన ఒక్కరే. ఆ తరవాత బ్రహ్మానందం అత్తిలి కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. కాలేజీలో పాటాలు చెబుతూ అప్పుడప్పుడూ మిమిక్రీ చేస్తూ విద్యార్థులను నవ్వించేవారు. అయితే బ్రహ్మానందం ఓ రోజు అత్తిలి గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆ కార్యక్రమంలో మిమిక్రీ చేస్తూ ప్రజలను ఫుల్ గా నవ్వించారు. ప్రజలు నవ్వడం చూసి అప్పుడే అక్కడకు వచ్చిన ఊరి ప్రెసిడెంట్ అందర్నీ నవ్వకూడదు అంటూ హెచ్చరించారు. ఆయనను చూసి నవ్వితే శిక్ష వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆయన తెలుగు లెక్చరర్ గౌరవం లేకుండా నవ్వుతారా అంటూ ప్రశ్నించారు. అయితే ఆ తరవాత ప్రెసిడెంట్ వెళ్లిపోయిన తరవాత బ్రహ్మానందం జోకులు వేసినా మిమిక్రీ చేసిన వాళ్లు చూస్తుండిపోయారు తప్ప నవ్వేలేదు. ఈ విషయాన్ని బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు.