Telugu News » Blog » ముకేష్ అంబానీలో ఈ రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందా…ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చేసిన పనికి అంతా జామ్..!

ముకేష్ అంబానీలో ఈ రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందా…ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చేసిన పనికి అంతా జామ్..!

by AJAY
Published: Last Updated on
Ads

ప్రపంచ కుబేరుల లిస్ట్ లో ముఖేష్ అంబానీ కూడా ఒకరు. వ్యాపార రంగంలో సత్తా చాటుతూ రోజురోజుకు తన వ్యాపారాలను విస్తరిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు పెడుతూ దూసుకుని పోతున్నారు. ఇక ఆ రేంజ్ వ్యక్తి అంటే ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

అయితే అలాంటి ముకేష్ అంబానీ తన భార్య నీతూ అంబానీ తో పెళ్లికి ముందు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ చిలిపి పని చేశారు. ఆ చిలిపి పనేంటి అన్నది ఇప్పుడు చూద్దాం…నీతా డ్యాన్స్ చూసి ముకేష్ అంబానీ తండ్రి ధీరు బాయ్ అంబానీ ఆమెను ఎలాగైనా తమ ఇంటికి కోడలిని చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట.

అంతే కాకుండా నీతా కుటుంబాన్ని తమ ఇంటికి పిలిపించుకుని సంబంధం మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంతకాలం డేటింగ్ చేశారు. ఆ సమయంలో ఒకరోజు ఇద్దరు కార్ లో వెళుతున్నారు. ఆ టైమ్ లో ముకేష్ అంబానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా నీతా కు ప్రపోజ్ చేశాడు.

కానీ నీతా మాత్రం ఎస్…నో చెప్పకుండా అలానే ఉండిపోయింది. అప్పుడే గ్రీన్ సిగ్నల్ పడింది. అయినప్పటికీ నువ్వు ఏదో ఒకటి చెబితేనే కార్ ముందుకు కదులుద్ది అని ముకేష్ అంబానీ పట్టుపట్టి కూర్చున్నారు. వెనక కార్ లు హారన్ లు కొడుతున్నా అలాగే ఉండిపోయారు. దాంతో నీతా ఎస్ చెప్పేసింది. అలా ఒక్కటైన ఈ జంట 1985 లో పెళ్లి చేసుకున్నారు.

ALso read :

40 దాటినా పెళ్లి చేసుకోని స్టార్ హీరోయిన్లు..! లవ్ ఫెయిల్యూర్ వల్లేనా…?

శ్రీ‌శైలంలో వాహ‌నాల‌పై బొమ్మ‌లు ఎందుకు వేస్తారో తెలుసా..?


You may also like